Thummala Nageswara Rao | తుమ్మలతో.. ఠాక్రే, రేవంత్ భేటీ! 17న కాంగ్రెస్‌లో చేరిక
Thummala Nageswara Rao | అదే రోజు మరిన్ని చేరికలు విధాత : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు శుక్రవారం భేటీ అయ్యారు. వారంతా తుమ్మల నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. వాస్తవానికి తుమ్మల ఈ నెల 5వ తేదీనే కాంగ్రెస్‌లో చేరాల్సివుంది. అయితే పాలేరు టికెట్ విషయమై […]

Thummala Nageswara Rao |
అదే రోజు మరిన్ని చేరికలు
విధాత : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు శుక్రవారం భేటీ అయ్యారు. వారంతా తుమ్మల నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు.
వాస్తవానికి తుమ్మల ఈ నెల 5వ తేదీనే కాంగ్రెస్‌లో చేరాల్సివుంది. అయితే పాలేరు టికెట్ విషయమై కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం, హైద్రాబాద్‌లోనే సీడబ్యుసీ సమావేశాలు, సోనియాగాంధీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపధ్యంలో తుమ్మల చేరిక వాయిదా పడింది.
ఒక దశలో అసలు తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారా లేక ఆగిపోయారా అన్న సందిగ్ధత కూడా వినిపించింది. ఈ క్రమంలో తుమ్మలతో ఠాక్రే, రేవంత్, భట్టి, పొంగులేటిలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారి మధ్య చర్చల సందర్భంగా ఈనెల 17న తుక్కుగూడలో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరికకు తుమ్మల అంగీకరించారని సమాచారం.
తుమ్మలతో పాటు మహబూబ్‌నగర్, భువనగిరిలకు చెందిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలు సైతం అదే సభలో కాంగ్రెస్‌లో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కూడా అదే రోజు లేక అంతకముందు సీడబ్ల్యుసీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్‌లో చేరవచ్చని తెలుస్తుంది.
వారితో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన బీఆరెస్, బీజేపీ అసంతృప్తులుగా ఉన్న మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సోనియాగాంధీ సభలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని సమాచారం.