Actor | మృత్యువుని ముందుగానే ఊహించిన నటుడు.. మిస్టీరియస్ మరణం పై చర్చలు
Actor | ఒకరి మరణం ముందే తెలిసిపోతే దాన్ని “ఫైనల్ డెస్టినేషన్”తో పోల్చుతారు. జీవితానికి అంతిమ గమ్యం మరణమే అయినా, దాని గురించి ముందుగానే సంకేతాలు ఇవ్వడం చాలా అరుదు. కానీ దక్షిణ కొరియా నటుడు, కే-డ్రామా స్టార్ జంగ్ ఉన్-వూ విషయంలో ఇప్పుడు అలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
Actor | ఒకరి మరణం ముందే తెలిసిపోతే దాన్ని “ఫైనల్ డెస్టినేషన్”తో పోల్చుతారు. జీవితానికి అంతిమ గమ్యం మరణమే అయినా, దాని గురించి ముందుగానే సంకేతాలు ఇవ్వడం చాలా అరుదు. కానీ దక్షిణ కొరియా నటుడు, కే-డ్రామా స్టార్ జంగ్ ఉన్-వూ విషయంలో ఇప్పుడు అలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆకస్మిక మరణం కొరియన్ సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. కేవలం 39 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందడం అభిమానులను, సహచరులను తీవ్ర విషాదంలో ముంచేసింది. జంగ్ ఉన్-వూ మరణవార్తను కొరియన్ మీడియా ధృవీకరించినప్పటికీ, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆయన మరణానికి గల అసలు కారణాలను వెల్లడించలేదు. దీంతో ఇది సహజ మరణమా? ఆత్మహత్యా? లేక మరేదైనా కారణమా? అన్న అనుమానాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అధికారిక ప్రకటన రాకపోవడంతో రూమర్స్ మరింతగా పెరుగుతున్నాయి.
మరణానికి కేవలం ఒక రోజు ముందు (ఫిబ్రవరి 10న) జంగ్ ఉన్-వూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో మూడు ఫోటోలు షేర్ చేశారు. వాటిలో హాంకాంగ్ నటుడు లెస్లీ చియుంగ్ ఫోటోతో పాటు, 2011లో మద్యం విషప్రయోగం వల్ల 27 ఏళ్లకే మరణించిన బ్రిటిష్ గాయని అమీ వైన్‌హౌస్ ఫోటోని కూడా అతడు తన ఫోటోతో పాటు షేర్ చేసాడు. “నిన్ను మిస్ అవుతున్నాను.. నిన్ను చూసి అసూయపడుతున్నాను.. చింతిస్తున్నాను… PIR.BG“ అని రాసాడు. “PIR.BG” అనే పదాన్ని రివర్స్‌లో చదివితే “GB.RIP” (Good Bye, Rest In Peace)గా వస్తుందని అభిమానులు గమనించారు. దీనిని కొందరు ఆయన ముందే ఇచ్చిన సంకేతంగా భావిస్తున్నారు. అయితే ఇది కేవలం యాదృచ్ఛికమా లేక ఆలోచించి పెట్టిన సందేశమా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
జంగ్ ఉన్-వూ 2006లో వచ్చిన రౌండప్ 3 ద్వారా తన నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో కూడా ఆయన తన ముద్ర వేశారు. 2021లో వచ్చిన మెమోరీ: మానిప్యులేటెడ్ మర్డర్ ఆయన నటించిన చివరి చిత్రం. టెలివిజన్, సినిమా రెండు రంగాల్లోనూ సమతుల్యంగా ముందుకు సాగిన నటుడిగా ఆయన పేరుపొందారు. జంగ్ ఉన్-వూ అంత్యక్రియలు ఫిబ్రవరి 13న జింపోలోని న్యూ కొరియా హాస్పిటల్ ఫ్యూనరల్ హాల్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సహనటులు ఆయనకు నివాళులు అర్పించేందుకు హాజరుకానున్నారు.
చిన్న వయసులోనే ప్రతిభావంతుడైన నటుడు ఇలా ఆకస్మికంగా దూరమవడం కొరియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి తీరని లోటుగా మారింది. అభిమానులు సోషల్ మీడియాలో ఆయన సినిమాలు, సీరియల్స్ నుంచి క్లిప్స్ షేర్ చేస్తూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. సహచరులు “అద్భుతమైన వ్యక్తిత్వం, వినమ్రత కలిగిన నటుడు” అంటూ ఆయనను స్మరించుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram