Telangana Petrol Availability | తెలంగాణలో పెట్రోల్, డీజీల్ కొరత లేదు

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, HPCL, IOCL, BPCLలో సరిపడ ఇంధన నిల్వలు ఉన్నాయని డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోల్ కొరత వస్తుందని ముందుగానే స్టాక్ పెట్టుకోవద్దని.. వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరిన అసోసియేషన్ పేర్కొంది.

విధాత : ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ తో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద పరిస్థితుల కారణంగా భారత్ లో ఇంధన కొరత సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలకు కొరత ఏర్పడిందన్న ప్రచారంతో వాహనదారులు పెట్రోల్ బంక్ ల వద్ద క్యూలు కడుతున్నారు. ఇంధన కొరత సమస్యలపై తెలంగాణ ఇంధన డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, HPCL, IOCL, BPCLలో సరిపడ ఇంధన నిల్వలు ఉన్నాయని డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోల్ కొరత వస్తుందని ముందుగానే స్టాక్ పెట్టుకోవద్దని.. వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరిన అసోసియేషన్ పేర్కొంది. పెట్రోల్, డీజిల్‌లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటూ ప్రకటన లో తెలిపింది. ఇంధన సరఫరాలు, నిల్వలు అందుబాటులో ఉన్నాయంటూ స్పష్టం చేసింది.

పెట్రోల్, డీజిల్ దొరకదనే భయంతో బంక్ లకు క్యూ కడుతున్నారని. ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని అసోసియేషన్ పేర్కొంది. సాధారణ విక్రయాల కంటే ఇంధన విక్రయాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో వదంతులతో వాహనదారులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్ దొరకదనే ఆందోళనతో అధిక మోతాదులో కొనుగోలు చేయవద్దని వినియోగదారులను కోరింది.

ఇంధన సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు (ఎల్‌పీజీ), యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో మంత్రులు, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించనున్నారు. రాష్ట్రంలో ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, అలాగే పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా నిల్వల నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలపై సమావేశంలో సమీక్షించనున్నారు.

ఇవి కూడా చదవండి :

Kavitha demands OBC sub quota| మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా ఇవ్వాలి : కవిత
gold, silver price increase| పెరిగిన బంగారం, వెండి ధరలు

Latest News