ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరోసారి వాయిదా
సుప్రీంకోర్టులో నేడు మరోసారి తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు విచారణ జరగనుంది. జస్టిస్ నాగరత్న ధర్మాసనం నేతృత్వంలో విచారణ జరగనున్నది. ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కల్పించిన మద్యంతర రక్షణను ఎత్తివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది
విధాత: సుప్రీంకోర్టులో నేడు మరోసారి తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు విచారణ జరగనుండగా. డిసెంబర్ 9కి వాయిదా వేస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రవు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కల్పించిన మద్యంతర రక్షణను ఎత్తివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభాకర్ రావు ఉపయోగించిన ఐ క్లౌడ్ సరియైన ఐడి, పాస్వర్డ్ ను దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని గత విచారణ సందర్భంగా ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా గతంలో ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్, కంప్యూటర్ల పాస్‌వర్డ్ చెప్పేందుకు ఆయన సహకరించడం లేదన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram