September 17| ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 : తెలంగాణ సర్కార్ ఆదేశాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జి మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలంటూ సర్క్యులర్ జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి సైతం సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగరవేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తోంది.
 
                                    
            విధాత : నిజాం ప్రభువు పాలన నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలు(హైదరాబాద్ సంస్థానం) స్వేఛ్చా వాయువులు పీల్చుకున్న సెప్టెంబర్ 17వ(September 17 Telangana Liberation Day) తేదీని రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచనమా.. విలీనం, విముక్తి, విద్రోహ దినంగా ఎవరికి తోచినట్లుగా వారు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవం(Telangana Praja Palana Dinotsavam 2025) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జి మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలంటూ సర్క్యులర్ జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Congress government orders). సీఎం రేవంత్ రెడ్డి సైతం సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో(Revanth Reddy flag hoisting Hyderabad) జాతీయ జెండా ఎగరవేయనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన సొంత జిల్లా ఖమ్మంలో జెండా ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా .. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరై జెండా ఆవిష్కరించనున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించడం గమనార్హం.
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram