ఎవరు మీలో కోటీశ్వరులు.. రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ వాసి
విధాత: ఎవరు మీలో కోటిశ్వరుడు గేమ్ షోలో తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి కోటి రూపాయల నగదు గెలుచుకున్నాడు. దీంతో తెలుగు టీవీ గేమ్ షోల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కంటెస్టెంట్‌గా ఆయన చరిత్ర సృష్టించాడు. కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజారవీంద్ర ఈ అద్భుతాన్ని చేశాడు. తెలుగు టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఓ గేమ్ షోలో ఒక వ్యక్తి ఇంత భారీగా ప్రైజ్ మనీ గెలువడం ఇదే తొలిసారి. […]

విధాత: ఎవరు మీలో కోటిశ్వరుడు గేమ్ షోలో తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి కోటి రూపాయల నగదు గెలుచుకున్నాడు. దీంతో తెలుగు టీవీ గేమ్ షోల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కంటెస్టెంట్‌గా ఆయన చరిత్ర సృష్టించాడు. కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజారవీంద్ర ఈ అద్భుతాన్ని చేశాడు. తెలుగు టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఓ గేమ్ షోలో ఒక వ్యక్తి ఇంత భారీగా ప్రైజ్ మనీ గెలువడం ఇదే తొలిసారి.
అయితే, జూనియర్ ఎన్‌టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం అవుతున్నది. ఈ షోలో పాల్గొన్న ఎస్సై రాజారవీంద్ర ఏకంగా కోటి రూపాయల ప్రైజ్ మనీ గెలిచి.. తెలుగు టీవీ గేమ్ షోలో భారీగా నగదు గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచాడు. సాధారణ పార్టిసిపెంట్స్, సెలెబ్రిటీ పార్టిసిపెంట్స్‌లో ఎవరు కూడా ఇంతవరకు ఇంత భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీగా గెలుచుకోలేదు.
దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ షోలో ఇప్పటివరకు ఎంతోమంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేసినా వారంతా వేలు, లక్షల్లో మాత్రమే నగదు బహుమతి గెలుచు కోగలిగారు. కానీ రాజారవీంద్ర ఒక్కడే కోటి రూపాయలు గెలిచాడు. ఈ విషయాన్ని జెమినీ టీవీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, రాజారవీంద్ర పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తూనే అనేక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాడు.
పోలీస్ కాంపిటీషన్స్‌లో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించా డు. ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్ పతకం గెలువాలన్నది రాజారవీంద్ర కల. ఎవరు మీలో కోట్వీరుడు గేమ్ షోలో గెలిచిన ప్రైజ్ మనీని తన కల నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుం టానని ఆయన చెప్పాడు. కాగా, రాజారవీంద్ర ప్రైజ్ మనీ గెలిచిన ఎపిసోడ్ సోమ, మంగళవారాల్లో (రేపు, ఎల్లుండి) రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది