తెలంగాణ టూరిజం శాఖ కొత్త టూర్ ప్యాకేజీ…చూసేయండి !

తెలంగాణ టూరిజం కొత్తగా "హైదరాబాద్ – యాదగిరిగుట్ట – శిల్పారామం – కొలనుపాక జైన దేవాలయం – స్వర్ణగిరి టెంపుల్ – పోచంపల్లి" వన్-డే పిలిగ్రిమేజ్ అండ్ హెరిటేజ్ టూర్ ప్యాకేజీ ప్రారంభించింది.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ టూరిజం కొత్తగా “హైదరాబాద్ – యాదగిరిగుట్ట – శిల్పారామం – కొలనుపాక జైన దేవాలయం – స్వర్ణగిరి టెంపుల్ – పోచంపల్లి” వన్-డే పిలిగ్రిమేజ్ అండ్ హెరిటేజ్ టూర్ ప్యాకేజీ ప్రారంభించింది. ఏసీ మినీ బస్సు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, హై-టీ, దర్శనాలతో కూడిన ఈ టూర్ ఛార్జి పెద్దలకు రూ. 2,070, పిల్లలకు రూ. 1,770. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి రాత్రి 7:30కు తిరిగి వస్తుంది.

ఒక్క రోజులో పూర్తయ్యే ఈ టూర్ ప్యాకేజీకి టూరిస్టుల నుంచి మంచి స్పందన వస్తుందని సమాచారం. ఈ టూర్ లో ఆధ్యాత్మిక దర్శనాలు, చారిత్రక ప్రదేశాలు, చేనేత కళలు అన్నీ కలిసి ఉండటంతో సందర్శకులలో ఆసక్తి నెలకొంది. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, సీటును బుక్ చేసుకోవడానికి తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

బోర్డింగ్ పాయింట్లు:

ఉదయం 7:00 గంటలకు సికింద్రాబాద్ యాత్రి నివాస్, 7:15 గంటలకు బేగంపేట పర్యాటక్ భవన్, 7:30 గంటలకు బషీర్‌బాగ్ CRO ఆఫీసు.

ప్రయాణించు ప్రదేశాలు :

యాదగిరిగుట్ట: ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం, ఆ తర్వాత హరితా హోటల్‌లో అల్పాహారం.
శిల్పారామం: యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న గ్రామీణ కళలు, హస్తకళల ప్రదర్శన.
కొలనుపాక జైన దేవాలయం: దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన, చారిత్రాత్మక జైన దేవాలయం.
స్వర్ణగిరి టెంపుల్: భువనగిరి వద్ద కొండపై ఉన్న అందమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.
పోచంపల్లి: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇక్కత్ (Ikat) చేనేత వస్త్ర పరిశ్రమలను సందర్శించడం, ఆ తర్వాత హరితా హోటల్‌లో హై-టీ.

Latest News