ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ దొరికిన కార్యకర్త
ఓటర్లకు డబ్బులను పంపిణీ చేస్తూ ఓ పార్టీ కార్యకర్త నగదుతో పాటు పోలీసులకు చిక్కాడు. ఓక్కో కవర్‌లో ఐదు వందల నోట్లను ఐదువేల చొప్పున పెట్టి ఓటర్లకు పంచుతుండగా ప్రత్యర్థి పార్టీలు అందించిన సమాచారంతో పోలీసులు ఆ కార్యకర్తను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నరు.

విధాత : ఓటర్లకు డబ్బులను పంపిణీ చేస్తూ ఓ పార్టీ కార్యకర్త నగదుతో పాటు పోలీసులకు చిక్కాడు. ఓక్కో కవర్‌లో ఐదు వందల నోట్లను ఐదువేల చొప్పున పెట్టి ఓటర్లకు పంచుతుండగా ప్రత్యర్థి పార్టీలు అందించిన సమాచారంతో పోలీసులు ఆ కార్యకర్తను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నరు.

పట్టుబడిన కార్యకర్త కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అనుచరుడుగా జీడిమెట్ల పోలీసులు పేర్కోన్నారు. ఎన్నికల్లో ఎవరైన ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.