KTR | 20 రోజులు సమావేశాలు పెట్టండి … బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

శాసన సమావేశాలు వచ్చే సీచజన్‌లో 20రోజులు పెట్టాలని, అందుకు తాము సహకరిస్తామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సూచన చేశారు.

KTR | 20 రోజులు సమావేశాలు పెట్టండి … బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

ఒక రోజు రెండు మూడు పద్దులపై చర్చలు చాలు

విధాత, హైదరాదాబాద్ : శాసన సమావేశాలు వచ్చే సీజన్‌లో 20రోజులు పెట్టాలని, అందుకు తాము సహకరిస్తామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సూచన చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కాగా, మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగిన నేప‌థ్యంలో కేటీఆర్ శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబుకు కీల‌క సూచ‌న చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే స్పీక‌ర్ అనుమ‌తితో కేటీఆర్ ఈ సూచ‌న చేశారు. ఒకే రోజు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిపి అప్రూవ్ చేసుకోవాల‌నే ఉద్దేశంతో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల వ‌ర‌కు స‌భ‌ను న‌డిపారు. సుదీర్ఘ ప్ర‌సంగాలు చేయొద్ద‌న్న శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రిస్తున్నామమని, కానీ ఈ స‌భ‌లో 57 మంది కొత్త స‌భ్యులు ఉన్నారని, వారంద‌రూ మాట్లాడాల‌ని అనుకుంటున్నారన్నారు. ఇలా రోజుకు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ పెట్టి సభపై ఒత్తిడి పెట్టకుండా రోజుకు 2 లేదా 3 ప‌ద్దుల‌పైన చ‌ర్చ పెట్టాల‌ని కోరుతున్నామన్నారు. రేపు ఈ స‌మావేశాలు అయిపోయాయని, కానీ వ‌చ్చే అసెంబ్లీ, బ‌డ్జెట్ స‌మావేశాల్లో రోజుకు 19 ప‌ద్దులు పెట్ట‌కుండా, 2 లేదా 3 ప‌ద్దుల‌పై సావ‌ధానంగా చ‌ర్చ జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. మంత్రులు కూడా సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. వ‌చ్చే సెష‌న్‌ను అవ‌స‌ర‌మైతే 20 రోజులు పెట్టాలని, మా వైపు నుంచి అందుకు త‌ప్ప‌కుండా సహకరిస్తామని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.