విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవాలి

హైదరాబాద్: తార్నాకలోని ఇంగ్లిష్ ఫారిన్‌ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఆవరణ నుంచి పోలీస్‌ బలగాలను ఉపసంహరించుకునేలా యూజీసీ, వర్సిటీ వైస్‌ చాన్స్‌ లర్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్‌ దాఖలు చేశారు

విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవాలి
  • యూజీసీ, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్


విధాత, హైదరాబాద్: తార్నాకలోని ఇంగ్లిష్ ఫారిన్‌ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఆవరణ నుంచి పోలీస్‌ బలగాలను ఉపసంహరించుకునేలా యూజీసీ, వర్సిటీ వైస్‌ చాన్స్‌ లర్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై రెండుసార్లు వీసీకి వినతిపత్రాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదన్నారు.


అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని, విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విద్యార్థులపై పోలీసులు దాడికి పాల్పడుతున్నారని, రాత్రి సమయాల్లో స్టేషన్‌లో ఉంచుతున్నారని.. దీన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నా వీసీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తమ వినతిపత్రంపై చర్యలు తీసుకుని, పోలీసులను ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ.. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వీసీ తదితరులను చేర్చారు.