Medigadda | మేడిగడ్డ బ్యారేజీ వద్ధ పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

: గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌కు క్రమంగా వరద పెరుగుతుంది. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన గేట్ల వద్ధ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వస్తున్న వరదను ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్నారు

  • By: Subbu |    telangana |    Published on : Jul 10, 2024 2:01 PM IST
Medigadda | మేడిగడ్డ బ్యారేజీ వద్ధ పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

విధాత, హైదరాబాద్ : గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌కు క్రమంగా వరద పెరుగుతుంది. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన గేట్ల వద్ధ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వస్తున్న వరదను ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్నారు. 85 గేట్లు ఎత్తిన దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 41,500 క్యూసెక్కులుగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతుంది. 115అడుగుల మేరకు ప్రవహిస్తుంది.

కాగా మేడిగడ్డ వద్ధ ఇసుక మేటల తొలగింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో వరద పెరగడంతో ఆ పనులకు ఆటంకాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద మేట వేసిన ఇసుకను తొలగించేందుకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్ ఖరారు చేసింది. 92 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను 14 బ్లాకులు విభజించి టెండర్లు ఆహ్వానించగా 400 ఏజెన్సీలు టెండర్లు దాఖళు చేశారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి కాంట్రాక్టులు ఖరారు చేశారు. త్వరలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోనూ ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 1000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలో 100కు పైగా ఇసుక రీచ్‌లు ఉండగా, ఎన్జీటీ సహా ఇతరాత్ర కేసుల నేపథ్యంలో ప్రస్తుత 33 రీచ్‌లు నడుస్తున్నాయి.