కత్తితో బెదిరించి సెల్‌ఫోన్ చోరీ యత్నం వ్యక్తి సాహసంతో దొరికిన దొంగలు
కత్తితో బెదిరించి తన సెల్‌ఫోన్ లాక్కోని పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు దొంగలను బాధిత వ్యక్తి ధైర్యంగా ఎదురించగా...సమయానికి ఇతరులు సహాయంగా రావడంతో దొంగలు పోలీసులకు చిక్కారు.

విధాత, హైదరాబాద్ : కత్తితో బెదిరించి తన సెల్‌ఫోన్ లాక్కోని పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు దొంగలను బాధిత వ్యక్తి ధైర్యంగా ఎదురించగా…సమయానికి ఇతరులు సహాయంగా రావడంతో దొంగలు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్‌లోని వెంగల్ రావునగర్‌లో జాషువా అనే హాస్టల్ ఓనర్ తన హాస్టల్ సమీపంలో ఉండగా, బల్బీర్ సింగ్, రామ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ కాల్ చేయమని కోరుతూ అతని వద్దకు వచ్చారు.
జాషువా తన ఫోన్‌ను వారికి ఫోన్ చేసుకునేందుకు ఇచ్చాడు. కాని ఆ ఫోన్‌తో వారు పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే గ్రహించిన జాషువా వారు పారిపోకుండా గట్టిగా సెల్‌ఫోన్‌తో సహా పట్టుకున్నాడు. ఆ దొంగలు జాషువాపై దాడి చేసి కొట్టి, కత్తితో బెదిరించారు. అయినా జాషువా వారిని ధైర్యంగా అలాగే పట్టుకున్నాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు, పక్కనే ఉన్న తన హాస్టల్ విద్యార్థులు వెంటనే జాషువాకు సహాయం చేసి పోలీసులకు ఫోన్ చేసి దొంగలను పట్టించారు.