రేపు సాలార్ జంగ్ మ్యూజియం మూసివేత‌.. కార‌ణం ఇదే..!

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న సాలార్ జంగ్ మ్యూజియంను ఈ నెల 9వ‌ తేదీన మూసివేయ‌నున్నారు. ఎందుకంటే ఉగాది పండుగ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఒక్క‌రోజు మ్యూజియంను మూసివేయ‌నున్న‌ట్లు మ్యూజియం అధికారులు వెల్ల‌డించారు.

  • Publish Date - April 8, 2024 / 07:49 AM IST

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న సాలార్ జంగ్ మ్యూజియంను ఈ నెల 9వ‌ తేదీన మూసివేయ‌నున్నారు. ఎందుకంటే ఉగాది పండుగ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఒక్క‌రోజు మ్యూజియంను మూసివేయ‌నున్న‌ట్లు మ్యూజియం అధికారులు వెల్ల‌డించారు.

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న సాలార్ జంగ్ మ్యూజియంను ఈ నెల 9వ‌ తేదీన (మంగ‌ళ‌వారం) మూసివేయ‌నున్నారు. ఎందుకంటే ఉగాది పండుగ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఒక్క‌రోజు మ్యూజియంను మూసివేయ‌నున్న‌ట్లు మ్యూజియం అధికారులు వెల్ల‌డించారు. దీంతో ప‌ర్యాట‌కులు, సంద‌ర్శ‌కులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని సూచించారు. మ‌ళ్లీ బుధ‌వారం నుంచి య‌ధావిధిగా మ్యూజియం సంద‌ర్శ‌కుల కోసం తెరిచి ఉంటుంద‌ని తెలిపారు.

సాలార్ జంగ్ మ్యూజియం హైద‌రాబాద్ న‌గ‌రంలోని మూసీ న‌ది ఒడ్డున ఉంది. మొత్తం మూడు బిల్డింగ్‌లలో మ్యూజియం విస్తరించి ఉంది. అందమైన కళాఖండాలు, శిల్పాలు, బొమ్మలు సందర్శకులను ఎంతో ఆకర్షిస్తాయి. ప్రపంచంలోని వివిధ నాగరికతల చరిత్ర, సంస్కృతి గురించి ఇవి తెలియజేస్తాయి. దేశంలోనే అతి పెద్ద మ్యూజియంగా పేరుగాంచిన సాలార్ జంగ్ మ్యూజియంను వీక్షించేందుకు వీకెండ్ సమయాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది.

Latest News