Gilli Danda| మన కర్ర బిళ్ల ఆటకు ఆ దేశంలో మహర్ధశ

తెలుగు రాష్ట్రాలలో పూర్వం గ్రామీణ క్రీడల్లో కర్ర బిళ్ల(గిల్లి దండ) ఆట ఎంతో ఫేమస్. తెలంగాణలో దీనిని చిర్ర గోన పేరుతో కూడా పిలుస్తారు. బిళ్ళంగోడు, కోడి బిళ్ళ, జిల్లాకోడి అని కూడా ప్రాంతాల వారిగా పిలుచుకుంటారు. మన దేశంలో దశాబ్దాల క్రితం కనుమరుగైన కర్రా బిళ్ల ఆట ఇప్పుడు ఓ దేశంలో కొత్తగా తన ఉనికిని చాటేందుకు సిద్దమవుతుంది. స్పెయిన్ దేశం 'బిల్లార్డా'గా పిలిచే ఈ ఆటకు లీగ్స్ నిర్వహిస్తూ తమ వారసత్వ ఆటల పరిరక్షణకు చర్యలు చేపట్టడం విశేషం.

Gilli Danda| మన కర్ర బిళ్ల ఆటకు ఆ దేశంలో మహర్ధశ

విధాత: తెలుగు రాష్ట్రాలలో పూర్వం గ్రామీణ క్రీడల్లో కర్ర బిళ్ల(గిల్లి దండ) ఆట(Gilli Danda) ఎంతో ఫేమస్. తెలంగాణలో దీనిని చిర్ర గోన పేరుతో కూడా పిలుస్తారు. బిళ్ళంగోడు, కోడి బిళ్ళ, జిల్లాకోడి అని కూడా ప్రాంతాల వారిగా పిలుచుకుంటారు. దీనిని ఆంగ్లంలో టిప్‌క్యాట్ (Tipcat Game) అంటారు. ఓ పొడవాటి కర్రతో చిన్న కర్రను గాలిలోకి ఎగరేసి దూరంగా కొట్టడం కర్ర బిళ్ల ఆట లక్షణం. గాలిలోకి ఎగరేసిన చిన్న కర్రను పెద్ద కర్రతో గాలిలో ఎక్కువసార్లు కొట్టి..ఎక్కువ దూరం కొట్టిన వారిని ఈ ఆటలో గ్రేట్ గా భావిస్తారు. భూమిలో ఓ చిన్న గుంట తీసి దానిలో గిల్లి(దండ కర్ర)ను పెట్టడం..గిల్లిని గాలిలోకి కొట్టడం..కొట్టిన దూరం మేరకు పాయింట్లు లెక్కించడం చేస్తారు. క్రికెట్, బేస్ బాల్ కు ముందు ఆటగా దీనిని చెప్పుకోవచ్చు. దేశంలో ఇది 2,500ఏళ్ల సంవత్సరాల ప్రాచీన ఆటగా గుర్తింపు పొందింది.

ఆధునిక నాగరికత, సాంకేతికత విస్తరించిన క్రమంలో పూర్వ కాలంలో ప్రసిద్ది చెందిన ఎన్నో ఆటలు కనుమరుగైపోయాయి. వాటిలో తెలుగు ప్రజల ఆట కర్ర బిళ్ల కూడా ఒకటి. ప్రస్తుత తరం వాళ్లలో కర్ర బిళ్ల ఆట అంటే ఏమిటో తెలియని వారు మెజార్టీగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. కనుమరుగైపోయిన కర్ర బిళ్ల వంటి ప్రాచీన గ్రామీణ ఆటల స్ధానంలో పలు రకాల క్రీడలు ఫెమస్ అయిపోయాయి. వాటిలో క్రికెట్, హాకీ, ఫుట్ బాల్, టెన్నిస్, షటిల్, చెస్, అధ్లెటిక్స్, కబడ్డీ వంటివి ప్రధాన ఆటలుగా కొనసాగుతున్నాయి. గుర్రపు పోటీలు, ఆర్చరీ, కత్తి సాము వంటి క్రీడలు ఇంకా ఉనికిలో ఉన్నాయి.

అయితే మన దేశంలో దశాబ్దాల క్రితం కనుమరుగైన కర్రా బిళ్ల ఆట ఇప్పుడు ఓ దేశంలో కొత్తగా తన ఉనికిని చాటేందుకు సిద్దమవుతుంది. ప్రాచీన క్రీడలకు పూర్వ వైభవం తీసుకురావాలని స్పెయిన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వారసత్వ ఆటను రక్షించేందుకు పిల్లలకు కర్ర బిళ్ల ఆటలను నేర్పించి లీగ్స్ నిర్వహిస్తుంది. గాలీషియా ప్రాంతంలో ‘బిల్లార్డా’గా పిలిచే కర్రా బిళ్ల ఆట(Spain Billarda)ను స్పెయిన్ ప్రొత్సహిస్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మన దేశంలోని ప్రభుత్వాలు కూడా ప్రాచీన గ్రామీణ క్రీడలను ప్రొత్సహించాలని నెటిజన్లు కోరుతున్నారు.