విధాత, హైదరాబాద్ : మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం చేపటిట్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటుచేసుకుంది. చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడ్డ నిజమాబాద్ వాసి గొల్ల రాజన్న(60) సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీసులు అతడిని వెంటనే కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కాగా చేప మందు ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. వేలాదిమందితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. ఆస్తమా బాధితులు పెద్దఎత్తున చేప ప్రసాదం కోసం వచ్చారు. క్యూలైన్‌లో ఉన్నవారికి నాలుగైదు గంటలు నిరీక్షించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.
చేప మందు పంపిణీలో విషాదం … భారీ తరలొచ్చిన జనం
మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం చేపటిట్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటుచేసుకుంది. చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడ్డ నిజమాబాద్ వాసి గొల్ల రాజన్న(60) సొమ్మసిల్లి పడిపోయాడు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు