TS EAPCET | మరికాసేపట్లో టీఎస్ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల
TS EAPCET | ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎప్‌సెట్( TS EAPCET ) ఫలితాలను శనివారం(మే 18) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

TS EAPCET | హైదరాబాద్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎప్‌సెట్( TS EAPCET ) ఫలితాలను శనివారం(మే 18) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కలిసి జేఎన్టీయూహెచ్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎప్‌సెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎప్‌సెట్ ఫలితాల కోసం https://eapcet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
ఈ నెల 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం వారికి, 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ వారికి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.