మారని ముందు మాట.. రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్య పుస్తకాలు వెనక్కి
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు పంపిణీ కాబడిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీ కాబడిన పాఠ్యపుస్తకాల్లో ముందుమాట మార్చకుండా పాత దానినే ముద్రించి విద్యాశాఖ పాఠశాలలకు పంపిణీ చేసింది

కొరవడిన ముందుచూపు
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు పంపిణీ కాబడిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీ కాబడిన పాఠ్యపుస్తకాల్లో ముందుమాట మార్చకుండా పాత దానినే ముద్రించి విద్యాశాఖ పాఠశాలలకు పంపిణీ చేసింది. ముందు మాట మార్పు చేయని విషయం వివాదాస్పదం కావడంతో పాఠ్యపుస్తకాలనలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను వాపస్ తీసుకోవాలని పేర్కొంది.
అయితే మళ్లీ వాటిని ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయమై స్పష్టతనివ్వలేదు. ఇప్పటికే విద్యార్థులకు యూనిఫామ్‌ను ఒక్క జతకే పరిమితం చేసిన ప్రభుత్వం.. తాజాగా ఇచ్చిన పుస్తకాలను వెనక్కి తీసుకోవడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముందు చూపులేని ఫ్రభుత్వ విధానాల వల్లే ఈ సమస్య తలెత్తిందని మండిపడుతున్నారు.