TS Inter Results | 20 తర్వాత తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!

TS Inter Results | హైదరాబాద్ : నిన్న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు కూడా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీ తర్వాత ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా, నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. మార్చి 10వ తేదీన మూల్యాంకన ప్రారంభం కాగా, మొత్తం నాలుగు విడుతల్లో పూర్తి చేశారు.
ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ నుంచి అనుమతి తీసుకొని ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.