TSCAB | టెస్కాబ్ మాజీ జీఎం వాణిబాల అరెస్టు
అధిక వడ్డీల ఆశచూపి సహోద్యోగులతో తన ప్రైవేట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు పెట్టించి ఎగవేసిన టెస్కాబ్ మాజీ జీఎం నిమ్మగడ్డ వాణిబాలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు

సహోద్యోగులకు 26కోట్ల కుచ్చుటోపీ
విధాత, హైదరాబాద్ : అధిక వడ్డీల ఆశచూపి సహోద్యోగులతో తన ప్రైవేట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు పెట్టించి ఎగవేసిన టెస్కాబ్ మాజీ జీఎం నిమ్మగడ్డ వాణిబాలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆమె భర్త మేక నేతాజీతో పాటు కుమారుడు శ్రీ హర్షను కూడా అరెస్టు చేశారు. టెస్కాబ్ బ్యాంకులో పనిచేసే 140మంది ఉద్యోగులను నమ్మించి వారితో తన భర్తకు చెందిన శ్రీ ప్రియాంక చిట్స్ ఆండ్ ఫైనాన్స్ సంస్థలో 26కోట్ల డిపాజిట్లు పెట్టించారు.
కొన్నాళ్లు వారికి అధిక వడ్డిలను చెల్లించి నమ్మించి ఒక్కసారిగా బోర్డు తిప్పేశారు. డిపాజిటర్లు పెట్టిన డబ్బులతో ఉడాయించారు. విషయం బయట పడడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వాణి బాల చిట్ ఫండ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అంతకుముందే వాణిబాలను సస్పెండ్ చేశారు. దాదాపు 532మందితో సుమారు రూ. 200 కోట్ల డిపాజిట్లు, చిట్‌లు పెట్టించి స్కామ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సివుంది.