ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల ధర్నా.. గ్రూప్ పరీక్షల పోస్టులు పెంచాలని డిమాండ్

గ్రూప్ 1,2,3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు గురువారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిల‌వాల‌ని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ధ‌ర్నాకు దిగారు.

ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల ధర్నా.. గ్రూప్ పరీక్షల పోస్టులు పెంచాలని డిమాండ్

విధాత, హైదరాబాద్‌: గ్రూప్ 1,2,3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు గురువారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిల‌వాల‌ని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ధ‌ర్నాకు దిగారు. ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన ఈ ధ‌ర్నాకు ప‌లు పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు మ‌ద్ద‌తు తెలిపారు.

గ్రూప్‌-2లో 2 వేల పోస్టులు, గ్రూప్ -3లో 3 వేల పోస్టుల‌కు పెంచాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని, గ్రూప్-2, 3 రాత‌ప‌రీక్ష‌ల‌ను డిసెంబ‌ర్ వ‌ర‌కు వాయిదా వేయాల‌న్నారు. జీవో 46ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి, వారి డిమాండ్ల‌ను నెర‌వేరుస్తామ‌ని రాహుల్ గాంధీ హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు.

కానీ ఇప్పుడు నిరుద్యోగుల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతున్నా, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కొత్త నోటిఫికేష‌న్ రాలేద‌న్నారు. ఎమ్మెల్సీలు బ‌ల్మూర్ వెంక‌ట్, చింత‌పండు న‌వీన్ కుమార్ ఇద్ద‌రు ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీలను విస్మరంచి ప్రభుత్వానికి వంతపాడుతున్నారని విమర్శించారు.