తెలంగాణలో ఖరారైన కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన
విధాత,హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు ఎంపీ సోయం బాపూరావు ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వద్ద సభకు భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రిచెట్టు వద్ద రజాకార్లు […]
విధాత,హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు ఎంపీ సోయం బాపూరావు ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వద్ద సభకు భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రిచెట్టు వద్ద రజాకార్లు ఊచకోత కోశారు. కాలక్రమంలో ఆ మర్రిచెట్టు వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది. అదే వెయ్యి ఊడల మర్రి చెట్టు వద్ద భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram