నీటిపారుదల శాఖలో సంస్కరణలు చేపట్టాలి: మంత్రి ఉత్తమ్

నీటిపారుదల శాఖా సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్ఠతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు

నీటిపారుదల శాఖలో సంస్కరణలు చేపట్టాలి: మంత్రి ఉత్తమ్

విధాత, హైదరాబాద్: నీటిపారుదల శాఖా సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్ఠతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడిగడ్డ ఉదంతంలో జాతీయ భద్రత సంస్థతో పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన వ్యాఖ్యలతో సి.డి.ఓ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన వ్యాఖ్యానించారు.

అటువంటి వ్యాఖ్యాలపై సి.డి.ఓ పునఃసమీక్షించుకుని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ముక్యంగా ప్రాజెక్టుల డిజైన్ ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకరావాలన్నారు. అందుకు అవసరమైన లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ముందుండాలన్నారు.

ఐ. ఐ. టి లు,ఎన్.ఐ టి ల వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి నీటిపారుదల శాఖలో నియమితులైన ఇంజినీర్లను సి.డి.ఓ లో పోస్టింగ్ ఇవ్వబోతున్నామన్నారు. అలాగే సి.డి.ఓ లో ఖాళీగా ఉన్న ఉద్యగాల భర్తీకి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అన్నీ స్థాయిలలో ఉద్యగాల భర్తీ చేపట్టడం సంస్థను బలోపేతం చేయడంలో బాగామే నన్నారు. నల్లగొండ జిల్లాలో నెల్లికల్లు, డిండి ఎత్తిపోతల పధకాల డిజైన్ లను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆలస్యమయ్యే కొద్దీ రైతులకు నీరు అందించడంలో జాప్యం జరుగుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ లను తక్షణమే ఆమోదించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.