ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయశాంతి శుక్రవారం హైద్రాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

విధాత : బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయశాంతి శుక్రవారం హైద్రాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మెదక్ ఎంపీ టికెట్ హామీతో ఆమె కాంగ్రెస్‌లో చేరినట్లుగా తెలుస్తుంది. కామారెడ్డి టికెట్ బీజేపీ అధిష్టానం ఇవ్వకపోవడం, స్టార్ క్యాంపయినర్ జాబితా నుంచి తొలగించి చేర్చడం, పార్టీలోని అంతర్గత పరిణామాలతో అసంతృప్తికి గురైన విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
1998లో విజయశాంతి రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచి మొదలైంది. 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన విజయశాంతి 2009 బీఆరెస్ లో ఆ పార్టీని విలీనం చేశారు. 2014 లో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి తిరిగి 2020లో మళ్ళీ బీజేపీలో చేరారు. 2009లో బీఆరెస్ నుంచి మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైన విజయశాంతి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.