వనపర్తి కాంగ్రెస్ టికెట్ ను అమ్ముకున్నారంటూ మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రణాళిక సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, కేసీ వేణుగోపాల్ లకు ఫిర్యాదు చేశారు. డబ్బులకు ఆశపడి ఎమ్మెల్యే టికెట్ ను మేఘారెడ్డికి అమ్ముకున్నారని ఇటీవల చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. చిన్నారెడ్డి వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమన్న మేఘారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పీసీసీ, ఏఐసీసీకి వ్యతిరేకంగా పార్టీకి నష్టం చేసేలా చిన్నారెడ్డి మాట్లాడారని, గతంలోనూ చిన్నారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారని మేఘారెడ్డి తన లేఖలో వివరించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవడంతో పాటుప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. విచారణ జరిపి చిన్నారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి కోరారు.
పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్ కు కూడా మేఘారెడ్డి తన ఫిర్యాదును అందించారు. చిన్నారెడ్డి సహా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలు కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పార్టీ హైకమాండ్ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలను క్రమశిక్షణా కమిటీ పరిశీలించి.. చిన్నారెడ్డి, మేఘారెడ్డిల వాదనలు విని హైకమాండ్ కు నివేదిస్తుందని తెలిపారు. చర మరోవైపు మేఘారెడ్డి అనుచరులు మంగళవారం గాంధీభవన్ ముందు చిన్నారెడ్డి హఠావో కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
చిన్నా రెడ్డి హటావో..కాంగ్రెస్ పార్టీ బచావో..!!
చిన్నారెడ్డిపై గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసిన వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి
తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్
చిన్నారెడ్డికి వ్యతిరేకంగా గాంధీ భవన్ ఎదుట మేఘారెడ్డి అనుచరుల… https://t.co/EDBGEu3e99 pic.twitter.com/HkhxEp4ohI
— Mirror TV (@MirrorTvTelugu) August 18, 2026
