వాతావరణశాఖ చల్లటి కబురు.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు
భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారుగా చిరుజల్లులు కురిశాయి
విధాత, ఆదిలాబాద్: భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరుగా చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండ తీవ్రతో ఇబ్బందులు పడ్డ ప్రజలు చిరు జల్లులతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదే కాకుండా మండుటెండలతో అల్లతల్లడమైపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి ముచ్చట చెప్పింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం కురిసే అవకాశం లేదని స్పష్టంచేసింది. 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram