Devi Sri Prasad | మంగ్లీ చెల్లెలితో.. దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి నిజమేనా?
Devi Sri Prasad | రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతానికి మైమరిచిపోని వారు లేరు. క్లాస్, మాస్ బీట్స్‌తో ఎంతో మంది అభిమానగణం సంపాదించుకున్నాడు దేవి. ఒకప్పుడు దేవి శ్రీ తన సంగీతంతో ఉర్రూతలూగించేవాడు. ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు. మలయాళ కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులో సత్తా చూపించుకోవడంతో దేవి శ్రీ ప్రసాద్‌కి అవకాశాలు తగ్గుతున్నాయి. మరోవైపు థమన్ హవా నడుస్తున్న సమయంలో దేవి కాస్త కనుమరుగయ్యాడనే చెప్పాలి. […]

Devi Sri Prasad |
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతానికి మైమరిచిపోని వారు లేరు. క్లాస్, మాస్ బీట్స్‌తో ఎంతో మంది అభిమానగణం సంపాదించుకున్నాడు దేవి. ఒకప్పుడు దేవి శ్రీ తన సంగీతంతో ఉర్రూతలూగించేవాడు. ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు. మలయాళ కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులో సత్తా చూపించుకోవడంతో దేవి శ్రీ ప్రసాద్‌కి అవకాశాలు తగ్గుతున్నాయి.
మరోవైపు థమన్ హవా నడుస్తున్న సమయంలో దేవి కాస్త కనుమరుగయ్యాడనే చెప్పాలి. అయితే నాలుగు పదుల వయసు దాటినా ఇంకా వివాహం చేసుకొని దేవి శ్రీ ప్రసాద్ త్వరలో స్టార్ సింగర్ చెల్లిని వివాహం చేసుకోబోతున్నాడంటూ తాజాగా ప్రచారం జరుగుతుంది.
గత కొద్ది రోజులుగా దేవి శ్రీ పెళ్లి గురించి నెట్టింట అనేక ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫలానా హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. వాటిపై దేవి శ్రీ స్పందించకపోవడంతో అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.
ఇక తాజాగా దేవి శ్రీ ప్రసాద్ పెళ్లికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ని ఊపేస్తున్న మంగ్లీ గురించి మనందరికి తెలిసిందే. ఆమె సోదరి ఇంద్రావతి పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ పాడి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.ఈ అవకాశం ఆమెకి ఇచ్చింది దేవి శ్రీ ప్రసాద్ కావడం విశేషం
దేవి శ్రీ ప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా ఇంద్రావతి ఆయనకి విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్స్ వారిద్దరికి లింక్ పెట్టారు. ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరి దీనిపై దేవి శ్రీ లేదంటే ఇంద్రావతి కాని స్పందించాల్సి వచ్చింది. ఇంద్రావతి ప్రస్తుతం చదువుకుంటుందని చదువు మీద ఫోకస్ పెట్టేందుకు పూర్తిస్థాయిలో ఇంకా సింగింగ్ ఫీల్డ్ లోకి రాలేదని ఆ మధ్య మంగ్లీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.