Vande Bharat Express | నెలాఖరులో కూతపెట్టనున్న కాచిగూడ – యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌..! టికెట్‌ ధరలు ఫిక్స్‌..!

Vande Bharat Express | కాచిగూడ్‌ - యశ్వంత్‌పూర్‌ మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలో పట్టాలెక్కనున్నది. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇందుకు కారణాలు ఏంటో తెలియరాలేదు. అయితే, ట్రయల్‌ రన్‌ పూర్తిగా నిర్వహించకపోడమేనని ప్రధాన కారణమని తెలుస్తున్నది. మరోసారి ట్రయల్‌ రన్‌ నిర్వహించి, నెలాఖరులోగా ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. […]

Vande Bharat Express | నెలాఖరులో కూతపెట్టనున్న కాచిగూడ – యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌..! టికెట్‌ ధరలు ఫిక్స్‌..!

Vande Bharat Express |

కాచిగూడ్‌ – యశ్వంత్‌పూర్‌ మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలో పట్టాలెక్కనున్నది. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇందుకు కారణాలు ఏంటో తెలియరాలేదు. అయితే, ట్రయల్‌ రన్‌ పూర్తిగా నిర్వహించకపోడమేనని ప్రధాన కారణమని తెలుస్తున్నది.

మరోసారి ట్రయల్‌ రన్‌ నిర్వహించి, నెలాఖరులోగా ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. అనుకున్న ప్రకారం ట్రయల్‌ రన్‌ సమయానికి పూర్తయితే నెలాఖరులోనే తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరు అధికారి తెలిపారు.

ఇంతకు ముందు డోన్‌ – కాచిగూడ మధ్య ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రైలు ప్రస్తుతం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఉన్నది. మరోసారి పూర్తిస్థాయిలో యశ్వంత్‌పూర్‌ వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. కాచిగూడ – యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు 16 కోచ్‌లతో నడుస్తుందని, ఇందులో రెండు ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లు.. మిగతా 14 చైర్‌కార్స్‌ ఉండనున్నాయి.

ఇక టికెట్ల విషయానికి వస్తే ఏసీ చైర్‌కార్‌లో ధర రూ.1545 నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇందులో క్యాటరింగ్‌ చార్జీలు రూ.299 ఉంటాయి. ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ రేటు విషయానికి వస్తే రూ.2425గా నిర్ణయించినట్లు సమాచారం.

కాచిగూడ – యశ్వంత్‌పూర్‌ మధ్య 618 కిలోమీటర్లు ఉన్నది. సాధారణంగా రైళ్లలో ప్రయాణానికి పది నుంచి 12 గంటల వరకు సమయం పడుతున్నది. వందే భారత్‌ రైలు ఏడు నుంచి ఎనిమిది గంటల్లో చేరుకోనున్నది. షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూల్‌, డోన్‌, ధర్మరం మీదుగా యశ్వంత్‌పూర్‌కు చేరుకోనున్నది.

రెండు ఐటీ నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరును కలుపుతుందని, ఈ రైలుకు ఆదరణ లభిస్తుందని రైల్వేశాఖ భావిస్తున్నది. ప్రస్తుతం విశాఖపట్నం – సికింద్రాబాద్‌ – విశాఖపట్నం, సికింద్రాబాద్‌ – తిరుపతి – సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌ రైళ్లకు మంచి డిమాండ్‌ ఉన్నది.