Rajeev Kanakala | సుమతో విడాకులు.. పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు: రాజీవ్ కనకాల
Rajeev Kanakala: టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో సుమ,రాజీవ్ కనకాల జంట కూడా ఒకటి. రాజీవ్ కనకాల నటుడిగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుండగా, సుమ తన యాంకరింగ్‌తో అదరహో అనిపిస్తుంది. సుమ మలయాళీ అయిన కూడా తన మాటలతో షోలని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సందడిగా సాగేలా చేస్తుంది. ఇక సుమ,రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకోగా, వీరిద్దరి విడాకుల గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. కొన్ని సార్లు […]
Rajeev Kanakala:
టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో సుమ,రాజీవ్ కనకాల జంట కూడా ఒకటి. రాజీవ్ కనకాల నటుడిగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుండగా, సుమ తన యాంకరింగ్‌తో అదరహో అనిపిస్తుంది. సుమ మలయాళీ అయిన కూడా తన మాటలతో షోలని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సందడిగా సాగేలా చేస్తుంది.
ఇక సుమ,రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకోగా, వీరిద్దరి విడాకుల గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. కొన్ని సార్లు విడాకుల అంశం అయితే నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఆ మధ్య సుమ – రాజీవ్ కనకాల మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, ఇద్దరూ కూడా విడాకులు తీసకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.
ఈ విషయంపై రాజీవ్ కనకాల పలుసార్లు స్పందించారు. తాజాగా మరోసారి ఆయన స్పందిస్తూ.. తనదైన శైలిలో స్పందించాడు. సుమ – నేను విడాకులు తీసుకోనున్నామనే వార్తలు ఎప్పటి నుండో వస్తున్నాయి. అలాంటివి ఏమి లేవని మేము చెబుతున్నా కూడా అవే పుకార్లు పుట్టిస్తున్నారు.
మా అమ్మానాన్నలు ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వచ్చి ఉంటే వారు ఎక్కువ బాధ ఉండేదేమో అన్నారు. సుమ ఇలాంటి వార్తలని పెద్దగా పట్టించుకోదు. కానీ నేను మాత్రం లైట్ తీసుకోలేను. ఇలాంటి వాటి వలన నా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. స్కూల్‌లో వారికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాడ్డాయని రాజీవ్ అన్నారు.
పిల్లలకి మా విడాకుల వలన ఎదురయ్యే ప్రశ్నల వలన చాలా ఇబ్బండి పడి ఉంటారు. క్లారిటీ ఇచ్చాక కూడా ఇలాంటి పుకార్లు రావడం చాలా దారుణమని రాజీవ్ అన్నారు. మేము కలిసే ఉన్నామని చెప్పడం కోసం, ఆమె షోస్ కి నేను వెళ్లాను.. తన ఈవెంట్స్ కి కూడా కొన్నిసార్లు హాజరయ్యాను.
ఇటీవల యూఎస్ వెళ్లినప్పుడు ఇద్దరం కలిసి రీల్స్ కూడా చేశాము. ఇలా పలు రకాలుగా మేము కలిసే ఉన్నాం బాబోయ్ అని చెప్పుకోవడం మాకు చాలా కష్టంగా ఉందని రాజీవ్ అన్నాడు. ఇప్పుడు ఈ నటుడు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram