IRCTC Tour | విజయనగరం శ్రీరామనారాయణం, వైజాగ్ అందాలను వీక్షించేందుకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
IRCTC Tour | విజయనగరంలోని ప్రముఖ రామాలయం శ్రీరామనారాయణం. ఈ ఆలయం శ్రీరామచంద్రుడి బాణం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అయితే, ఆలయాన్ని సందర్శించుకోవాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో రామనారాయణం ఆలయంతో పాటు వైజాగ్‌లోని ప్రముఖ ఆలయాలన్నింటిని దర్శించుకోవచ్చు.

IRCTC Tour | విజయనగరంలోని ప్రముఖ రామాలయం శ్రీరామనారాయణం. ఈ ఆలయం శ్రీరామచంద్రుడి బాణం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అయితే, ఆలయాన్ని సందర్శించుకోవాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో రామనారాయణం ఆలయంతో పాటు వైజాగ్‌లోని ప్రముఖ ఆలయాలన్నింటిని దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ రెండురోజుల పాటు కొనసాగుతంది. తక్కువ ప్యాకేజీతోని విశాఖపట్నంలోని ప్రసిద్ధి ప్రదేశాలను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఇందు కోసం ‘గ్లోరియస్ ఆంధ్రా విత్ శ్రీ రామనారాయణం’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని నడుపుతున్నది. రెండురోజుల పర్యటనలో విశాఖపట్నంలోని సింహాచలం ఆలయం, తొట్లకొండ బౌద్ధ సముదాయాలు, విజయనగరం శ్రీరామనారాయణం ఆలయంతో పాటు సుందరమైన బీచ్‌లను సైతం వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. రూ.5885కే ప్యాకేజీ అందుబాటులో ఉన్నది. అయితే, టూర్ ప్యాకేజీలో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.13,630 చెల్లించాల్సి ఉంటుంది. ట్విన్ షేరింగ్‌కు రూ.7535 చెల్లిస్తే సరిపోతుంది. ఇక ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5,505గా నిర్ణయించారు. పిల్లలకు బెడ్‌తో అయితే రూ.4860, బెడ్ అవసరం లేదనుకుంటే రూ.3110 చెల్లించాల్సి ఉంటుంది.
పర్యటన కొనసాగుతుంది ఇలా..
శ్రీరామనారాయణం టూర్ విశాఖపట్నం నుంచి మొదలవుతుంది. పర్యాటకులు రైల్వేస్టేషన్, బస్‌డిపో, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా పికప్ చేసుకొని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లోకి చెక్ ఇన్ అయ్యాక అల్పహారం చేస్తారు. ఉదయం 9 గంటలకు రిషికొండ బీచ్ పర్యటనకు వెళ్తారు. అక్కడ తొటలకొండ బౌద్ధ సముదాయానికి వెళ్తారు. ఇది రిషికొండ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి పురాతన బావికొండకు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం వరకు బావికొండ పురాతన బౌద్ధ విహారం పర్యటన ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రెస్టారెంట్‌లో లంచ్ ఉంటుంది. భోజనం అనంతరం కైలాసగిరి హిల్స్ పార్క్ సందర్శనకు వెళ్తారు. సాయంత్రం 4గంటల సమయంలో కైలాషగిరి హిల్స్ నుంచి విజయనగరంలోని శ్రీరామనారాయణ దేవాలయం సందర్శనకు వెళ్తారు.
సాయంత్రం 5.20 గంటలకు చేరుకొని.. సాయంత్రం 7 గంటల వరకు రామనారాయణం ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఆసక్తి ఉన్న వారు లేజర్ షోను చూసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ విశాఖపట్నం తిరుగు ప్రయాణమవుతారు. రాత్రి హోటల్‌లోనే డిన్నర్ చేసుకొని బస చేస్తారు. రెండోరోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని హోటల్ నుంచి చెక్ అవుట్ అయి.. సింహాచలం ఆలయానికి బయలుదేరి వెళ్తారు. వరాహలక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం విశాఖలోని మ్యూజియానికి బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత మత్స్య దర్శిని చూసేందుకు బయలుదేరతారు. మధ్యాహ్నం రెస్టారెంట్‌లో లంచ్ చేసుకొని.. ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం జలాంతర్గామి మ్యూజియానికి బయలుదేరుతారు. సాయంత్రం ఆర్కేబీచ్ బయలుదేరుతారు. ఆర్కే బీచ్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. పర్యాటకులను బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్‌లో దింపుతారు. దాంతో పర్యటన పూర్తవుతుంది.