IRCTC Package | మొదలైన చార్‌ధామ్‌ యాత్ర.. స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ.. 12 రోజులు ప్రయాణం..!

IRCTC Package | దేశంలోనే ప్రముఖ చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఇక ఈ నెల 10న అక్షయ తృతీయ రోజున యమునోత్రి, గంగోతి, కేదార్‌నాథ్‌ ఆలయాలు తెరుచుకున్నాయి. తాజాగా ఆదివారం బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరిచారు. ఈ క్రమంలో పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం స్పెషల్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది.

IRCTC Package | మొదలైన చార్‌ధామ్‌ యాత్ర.. స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ.. 12 రోజులు ప్రయాణం..!

IRCTC Package | దేశంలోనే ప్రముఖ చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఇక ఈ నెల 10న అక్షయ తృతీయ రోజున యమునోత్రి, గంగోతి, కేదార్‌నాథ్‌ ఆలయాలు తెరుచుకున్నాయి. తాజాగా ఆదివారం బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరిచారు. ఈ క్రమంలో పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం స్పెషల్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఉత్తరాఖండ్‌లోని ఆలయాలను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా చార్‌ధామ్‌ యాత్రలో పాల్గొనాలని కోరుకుంటారు. అక్కడికి వెళ్లేందుకు ఖర్చుతో కూడుకున్నది కావడంతో తక్కువ మంది వెళ్తుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ ఒక్కోసారి 20 మందితో ప్రత్యేకంగా గ్రూప్‌గా చేసి.. ఈ నెల 15న, జూన్‌ 1న, 15న, సెప్టెంబర్‌ 1, 15న, అక్టోబర్‌ 1, 15 తేదీల్లో పర్యాటకులను చార్‌ధామ్‌ యాత్రకు తీసుకెళ్లనున్నది. అయితే, ప్యాకేజీ ఢిల్లీ నుంచి కొనసాగుతుంది. బస్‌లో ఉంటుంది. టూర్‌ ప్యాకేజీలో 12 రోజుల ప్రయాణం సాగుతుంది.

ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్‌ యాత్ర ఇలా..

ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్‌ యాత్ర ఢిల్లీలోని రైలు నివాస్ బిల్డింగ్ మొదలవుతుంది. ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు బయలుదేరి వెళ్తారు. ప్రయాణికులు తమ సొంత డబ్బులతో దారిలో భోజనం చేయాల్సి ఉంటుంది. అయితే హరిద్వార్ చేరుకున్న తర్వాత విందు, రాత్రి బస ఏర్పాట్లు ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేస్తుంది. రెండోరోజు ఉదయం ప్రయాణికులు అల్పాహారం తర్వాత.. బస్‌ హరిద్వార్‌ నుంచి బార్కోట్‌కి బయలుదేరుతుంది. ప్రయాణికులు అక్కడే బస చేయాల్సి ఉంటుంది. మూడోరోజు దుయం జానకి ఛత్‌లో యమునోత్రికి వెళ్తారు. జానకీ ఛత్ చేరుకున్న తర్వాత ప్రయాణికులు యమునా దేవి ఆలయ సందర్శనకు వెళ్తారు. దర్శనాల అనంతరం తిరిగి బార్కోట్‌కి వస్తారు. నాలుగో రోజు ఉదయం ఉత్తరకాశీకి బయలుదేరి వెళ్తారు. మార్గమధ్యలో ప్రతిపేశ్వర్ మహాకల్, కాశీ విశ్వనాథుడిని సందర్శించి అనంతరం ఉత్తరకాశీకి చేరుకుంటారు. రాత్రి ఉత్తరకాశిలోనే బస చేయాల్సి ఉంటుంది. ఐదో రోజు ఉదయం 5 గంటలకు ఉత్తరకాశీ నుంచి భాగీరథి నదిని పూజిస్తూ భక్తులు గంగోత్రి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ గంగాదేవి ఆలయాన్ని దర్శిస్తారు. తిరిగి మళ్లీ ఉత్తరకాశీకి పయణమవుతారు. ఆరో రోజు గుప్తకాశీకి బయలుదేరుతారు.

అక్కడికి వెళ్లిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి కూడా బస ఇక్కడే ఉంటుంది. ఏడోరోజు ఉదయం 4 గంటలకు సోన్‌ప్రయాగకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సొంత ఖర్చులతో కేదార్‌నాథ్‌కు పల్లకీని బుక్‌చేసుకొని గౌరీకుండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. కేదార్‌నాథ్‌ను దర్శించిన అనంతరం అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. 8వ రోజు కేదార్‌నాథ్‌ ఆలయంలో పూజలు చేసుకొని.. అదే ప్రాంగణంలో విశ్రాంతి తీసుకొని.. ఆ తర్వాత గౌరీకుండ్‌కు పాదయాత్రగా బయలుదేరాలి. అక్కడి నుంచి మళ్లీ సోన్‌ప్రయాగకు మీదుగా గుప్తకాశీకి చేరుతారు. తొమ్మిదో రోజు బద్రీనాథ్ వెళతారు. బద్రీనాథ్ చేరుకున్న అనంతరం జోషిమఠ్‌లో కొలువుదీరిన నారసింహస్వామిని దర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. ఇక పదో రోజు బద్రినారాయణుడి దర్శనం చేసుకొని రుద్రప్రయాగకు వెళ్తారు. 11న రుద్రప్రయాగ నుంచి హరిద్వార్‌కు వెళ్తారు. అక్కడ మానసాదేవిని దర్శించుకొని సాయంత్రం గంగా హారతి చూసి అక్కడ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. 12వ రోజు హరిద్వార్‌ నుంచి ఢిల్లీకి చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు ఇలా..

ఐఆర్‌సీటీసీ రోడ్‌ ప్యాకేజీలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.91,550గా నిర్ణయించింది. డబుల్‌ షేరింగ్‌కు రూ.57వేలు, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.54,490గా నిర్ణయించింది. పిల్లలకు సైతం వేర్వేరు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 5-1 సంవత్సరాల మధ్య పిల్లలకు రూ.30,910 (విత్‌బెడ్‌), రూ.20480 (విత్‌ అవుట్‌బెడ్‌)గా నిర్ణయించారు. ప్యాకేజీలోనే భక్తులు బస చేసేందుకు హోటల్‌ సౌకర్యం ఉంటుంది. అల్పాహారం, రాత్రి భోజన సదుపాయాలు ఉంటుంది. జీఎస్టీతో కలిసి అన్ని పన్నులను ప్యాకేజీలో చేర్చారు. ప్రయాణికులకు ప్రతిరోజూ లీటర్‌ వాటర్‌ బాటిల్‌ అందిస్తారు. ప్యాకేజీలో బీమా సౌకర్యం సైతం కవర్‌ అవుతుంది. సొంత ఖర్చులతోనే ప్రయాణికులు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. కేదార్‌నాథ్‌కు హెలీకాప్టర్‌కు, గైడ్‌ ఛార్జీలు, టెలిఫోన్‌, డ్రింక్స్‌, రాఫ్టింగ్‌తో పాటు వ్యక్తిగత ఖర్చులను పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో కాకుండా ఇతర ఆహారాలు, డ్రింక్స్‌ కావాలనుకుంటే మీరే భరించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణాలతో టికెట్‌ రద్దు చేసుకుంటే పాలసీ మేరకు రీఫండ్‌ చేయనున్నారు. పర్యటన ప్రారంభానికి గంట మందు పికప్‌ పాయింట్‌ చేరుకోవాల్సి ఉంటుంది. ఏదైనా వస్తువు విచ్ఛిన్నమైతే క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.

వివరాలకు కింది లింక్‌ని క్లిక్‌ చేయండి..

https://www.irctctourism.com/pacakage_description?packageCode=NDH24