World Biggest Airport | ప్రపంచంలోనే అదిపెద్ద ఎయిర్‌పోర్ట్‌ను కట్టబోతున్న దుబాయి..!

World Biggest Airport | ఎడారి దేశమైన దుబాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం రూపుదిద్దుకోనున్నది. 34.85 బిలియన్‌ డాలర్ల వ్యయంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించనున్నట్లు దుబాయి పాలకుడు షేక్‌ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఎయిర్‌పోర్టుకు అల్ మక్తూమ్ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌గా పిలువనున్నట్లు ఆయన ప్రకటించారు.

World Biggest Airport | ప్రపంచంలోనే అదిపెద్ద ఎయిర్‌పోర్ట్‌ను కట్టబోతున్న దుబాయి..!

World Biggest Airport | ఎడారి దేశమైన దుబాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం రూపుదిద్దుకోనున్నది. 34.85 బిలియన్‌ డాలర్ల వ్యయంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించనున్నట్లు దుబాయి పాలకుడు షేక్‌ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఎయిర్‌పోర్టుకు అల్ మక్తూమ్ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌గా పిలువనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రాజెక్టు వ్యయం భారతీయ కరెన్సీలో అక్షరాల రూ.2.9లక్షల కోట్లు. ఈ విమానాశ్రయాన్ని ఏడాదికి 260 మిలియన్ల మంది రాక‌పోక‌లు కొన‌సాగించేలా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. ప్రసుతం దుబాయిలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కంటే ఆదాపు ఐదురెట్లు పెద్దగా ఉంటుందని ఆయన వెల్లడించారు. రాబోయే సంవత్సరాల్లో దుబాయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇక విమానాశ్రయంలో 400 టెర్మినల్ గేట్స్‌.. ఐదు సమాంతర రన్‌వేలు ఉంటాయి. ప్రపంచాన్ని దుబాయికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్‌లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేష‌న్‌గా మారబోతుందని ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. ఈ నిర్మాణం ‘ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా దుబాయి స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది’ అని దుబాయి ఎయిర్‌పోర్ట్‌ సీఈవో పాల్ గ్రిఫిత్స్ పేర్కొన్నారు. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది రాక‌పోక‌లు కొన‌సాగించే సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నది. ఏడాది దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుత దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం కంటే ఐదు రెట్లు పెద్దగా ఉంటుంది. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలు రాబోయే ఐదేళ్లలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కి బదిలీ చేయనున్నారు. ఏవియేషన్ రంగంలో తొలిసారిగా కొత్త ఏవియేషన్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు అల్ మక్తూమ్ ఎక్స్‌ పోస్టులో వెల్లడించారు.