Viral Video | నేటి టెక్నాలజీ యుగంలో స్మార్ట్ఫోన్లలో గంటల తరబడి గడిపేస్తున్నారు తప్ప.. కష్టమొచ్చినప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఒక్క ఫ్రెండ్ను కూడా మెయింటైన్ చేయడం లేదు. ఒకవేళ బాధలు చెప్పుకుందామన్నా.. వినడానికి ఎవరికీ అంత ఓపిక ఉండటం లేదు. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయత్నం సోషల్మీడియాలో వైరల్గా మారింది. డబ్బులు ఇస్తే మీ బాధలు వింటానంటూ.. ఫ్లకార్డు పట్టుకుని ముంబై బీచ్లో తిరగడం ద్వారా ఇంటర్నెట్లో చర్చకు దారితీశాడు.
మీ సమస్యలు వింటానంటూ ఫ్లకార్డు పట్టుకుని తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. అందులో యువకుడు ఒక బోర్డును పట్టుకున్నాడు. దానిపై ఎవరైనా తమ బాధ చెప్పుకోవాలని అనుకుంటే నేను వింటా అని హిందీలో రాసి ఉంది. తను వినే సమస్యల తీవ్రతను బట్టి చార్జ్ చేస్తానని ఆ బోర్డుపై క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. చిన్న సమస్యలు చెప్పుకోవాలంటే రూ.250, వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలంటే రూ.500, కూర్చొని ఏడవాలంటే రూ.1000 చార్జ్ చేస్తానని బోర్డుపై రాసి ఉంది.
ఈ వీడియోలో వైరల్గా మారిన యువకుడిని పృథ్వీరాజ్ బోహ్రాగా గుర్తించారు. ఈ బోర్డు వైరల్ కావడంతో.. ఇది నిజంగా సక్సెస్ అవుతుందా? ఎవరైనా జనాలు వస్తున్నారా? అని పృథ్వీని అడగడంతో ఊహించని సమాధానం చెప్పాడు. చాలామంది వచ్చి తమ బాధలు, సమస్యలు చెప్పుకుంటున్నాడని వివరించాడు.
🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.
REPORTER : Do people come? 🤯
MAN : “Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems” 😳pic.twitter.com/cTXeKgzLzl
— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026
ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది బెస్ట్ ఐడియా అని.. మానసికంగా కుదుటపడటానికి ఇదొక మంచి అవకాశం అని కొంతమంది చెబుతున్నారు. కాగా, బాధలు వినడానికి ఇలా డబ్బులు తీసుకోవడం సరికాదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇది నెక్ట్స్ స్టార్టప్ ఐడియా అని ఒకరు అంటే. ప్రస్తుతం నగరాల్లో ఒంటరితనంతో బాధపడుతున్న వారికి ఇలాంటి సేవలు చాలా అవసరమని మరికొందరు అభిప్రాయడుతున్నారు. ఏదైమైనా పృథ్వీ చేస్తున్న బిజినెస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read More:
లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు.. ఒక్క ప్రశ్నతో 57 వేలకు తగ్గింది.. వైరల్ ఘటన!
సూసైడ్ కాదు.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చెరువులో శవాల్లా కొత్త జంట ఫోజులు
రైలు చివరి బోగీపై ‘X’ గుర్తు.. చాలామందికి తెలియని భారతీయ రైల్వే సీక్రెట్!
