అసెంబ్లీ నుంచి ఈటల సస్పెన్షన్.. నేడు చార్జీషీట్ విడుదల?
విధాత, హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమవేశాలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. గత శుక్రవారం స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోవడంతో వేటు వేశారు. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి ఈటలపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం సభ నుంచి బయటకు వెళ్ళాలని స్పీకర్ ఈటలకు సూచించారు. అయితే రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలపై ఈటల ఓ ఛార్జ్ షీట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. రెవెన్యూ అంశాలపై […]

విధాత, హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమవేశాలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. గత శుక్రవారం స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోవడంతో వేటు వేశారు. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి ఈటలపై సస్పెన్షన్ వేటు పడింది.
మంగళవారం సభ నుంచి బయటకు వెళ్ళాలని స్పీకర్ ఈటలకు సూచించారు. అయితే రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలపై ఈటల ఓ ఛార్జ్ షీట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. రెవెన్యూ అంశాలపై ఈటల మాట్లాడే అవకాశం ఉండటంతోనే ఈటలపై సస్పెన్షన్ వేటు వేశారని ఈటల వర్గీయులు ఆరోపిస్తున్నారు.
మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు: ఈటల
స్పీకర్‌పై కామెంట్స్‌ను రాజేందర్ సమర్థించుకున్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఈటల స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని.. మరమనిషి అని అహంకారంతో మాట్లాడారని దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. అయితే తాను 12 ఏళ్ల పాటు సభలో ఉన్నానని.. తనకు సభా మర్యాద తెలుసని ఈటల పేర్కొన్నారు.
అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం పోలీసు వాహనంలో తనను బలవంతంగా తీసుకెళ్లడంపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై మండిపడ్డారు.
‘‘మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారు. ఏడాది కాలంగా నాపై కుట్ర చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారు. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించనని స్పష్టం చేశారు.