JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ లింక్ ఇదే
విధాత, హైదరాబాద్: JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయకు 6వ ర్యాంకు వచ్చింది. ఫలితాలు విడులైన నేపథ్యంలో రేపటి నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. […]
విధాత, హైదరాబాద్: JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయకు 6వ ర్యాంకు వచ్చింది.
ఫలితాలు విడులైన నేపథ్యంలో రేపటి నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో బాలికలకు 1,567 సీట్లను సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యధికంగా 2,129 మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం సీట్లలో ఇవి సుమారు 13 శాతం. ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ సీట్లనూ కలిపితే అది 14 శాతానికి పెరుగుతుంది. ఫలితాల కోసం https://result.jeeadv.ac.in/ లాగిన్ అవ్వండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram