Viral news | బీరు బాటిల్‌తో బస్సు అద్దం పగులగొట్టి.. పట్టుకున్న కండక్టర్‌పై పాము విసిరి.. నగరంలో వృద్ధురాలు హల్‌చల్..!
Viral news | నగరంలో ఓ వృద్ధురాలు హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆమె చెయ్యెత్తినా డ్రైవర్ బస్సు ఆపలేదంటూ ఆగ్రహించింది. తన దగ్గరున్న ఖాళీ బీరు బాటిల్‌ను బస్సుపైకి విసిరికొట్టింది. దాంతో బస్సు అద్దం పగిలిపోయింది. ఆర్టీసీ బస్సును ఆపలేదంటూ మద్యం మత్తులో ఓ మహిళ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగులగొట్టింది.

Viral news : నగరంలో ఓ వృద్ధురాలు హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆమె చెయ్యెత్తినా డ్రైవర్ బస్సు ఆపలేదంటూ ఆగ్రహించింది. తన దగ్గరున్న ఖాళీ బీరు బాటిల్‌ను బస్సుపైకి విసిరికొట్టింది. దాంతో బస్సు అద్దం పగిలిపోయింది. ఆర్టీసీ బస్సును ఆపలేదంటూ మద్యం మత్తులో ఓ మహిళ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగులగొట్టింది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సీఐ జగదీశ్వర్‌రావు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్ ఫాతిమా బీబీ అలియాస్ అసీం (65) గురువారం సాయంత్రం విద్యానగర్ చౌరస్తాలో దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన 107 వీ/ఎల్ నంబర్ బస్సును ఆపాలంటూ చెయ్యెత్తింది. స్థానికంగా మూలమలుపు ఉండటం, రద్దీ ఉండటం కారణంగా డ్రైవర్ బస్సు ఆపలేదు.
దాంతో ఆగ్రహించిన మహిళ తన వద్ద ఉన్న ఖాళీ బీరు సీసాతో బస్సు వెనుక అద్దం పగులగొట్టింది. అనంతరం డ్రైవర్ బస్సును ఆపడంతో కండక్టర్ స్వప్న బస్సు దిగి బేగం వద్దకు వెళ్లి గట్టిగా పట్టుకుంది. వదిలించుకోవాలని ఆమె ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో తన వద్ద ఉన్న సంచిలో పాము ఉందంటూ కండక్టర్‌ను బెదిరించింది.
అయినా కండక్టర్ విడిచిపెట్టకపోవడంతో తన సంచిలో ఉన్న నాలుగు అడుగుల పొడవున్న జెర్రిపోతును ఆమెపైకి విసిరింది. అది స్వప్న మీద పడి తర్వాత పారిపోయింది. ఈ హఠాత్పరిణామానికి ప్రయాణికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలు బేగంను అదుపులోకి తీసుకున్నారు. పాము కోసం వెతికినా దొరకలేదు. వృద్ధురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.