గాఢ నిద్రలో యజమాని.. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి చిలుక ఏం చేసిందో తెలుసా..? వీడియో
చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. అలాగే పక్షులను కూడా పెంచుకుంటుంటారు. ఇక ఆ పక్షులకు ఆహారం అందిస్తూ.. వాటిని తమ సొంత బిడ్డల్లాగా కాపాడుకుంటారు.

విధాత: చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. అలాగే పక్షులను కూడా పెంచుకుంటుంటారు. ఇక ఆ పక్షులకు ఆహారం అందిస్తూ.. వాటిని తమ సొంత బిడ్డల్లాగా కాపాడుకుంటారు. ఆ పక్షులు యజమానుల పట్ల కూడా అదే స్థాయిలో అభిమానాన్ని చూపిస్తుంటాయి. యజమానికి ఏమన్న అయితే కూడా అవి తట్టుకోలేవు. అయితే తన యజమాని గాఢ నిద్రలో ఉండగా ఓ చిలుక చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఓ వ్యక్తి తన ఇంట్లో బెడ్‌పై నిద్రిస్తున్నాడు. గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఓ చిలుక.. అతని బెడ్ వద్ద వాలిపోయింది. తన యజమాని జుట్టును గమనించిన చిలుక.. దానికి ఇంకేమైనా మెరుగులు దిద్దాలనుకుంది. అనుకున్నదే తడువుగా తన అందమైన ఈకలతో.. యజమాని తలను ఎంతో అందంగా అలంకరించింది.
ఇక యజమాని తల రంగు రంగుల ఈకలతో ఎంతో అందంగా కనిపిస్తోంది. చూడడానికి అతను కూడా ఎంతో అందంగా కనిపించాడు. ప్రస్తుతం చిలుక కేశాలంకరణ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు చిలుక తెలివి భలేగా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు