కరెంట్ బల్బును దొంగిలించిన పోలీసు కానిస్టేబుల్.. వీడియో
ప్రజల ఆస్తులకు భద్రతగా ఉండాల్సిన పోలీసులే.. అడ్డదారులు తొక్కుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్.. కరెంట్ బల్బును దొంగిలించాడు
ప్రజల ఆస్తులకు భద్రతగా ఉండాల్సిన పోలీసులే.. అడ్డదారులు తొక్కుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్.. కరెంట్ బల్బును దొంగిలించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఈ నెల 20న అర్ధారత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బలియా జిల్లాలోని సికందర్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్నాడు. ఏప్రిల్ 20వ తేదీన రాత్రి ఒంటి గంట సమయంలో ఓ చౌరస్తాలో ఆ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే వెలుగుతున్న కరెంట్ బల్బును కానిస్టేబుల్ దొంగిలించాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు ముందు ఆ కానిస్టేబుల్‌లో ఫోన్‌లో మాట్లాడినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
కానిస్టేబుల్ కరెంట్ బల్బును దొంగిలించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram