ప్రియా.. 544 కేజీల బ‌రువును మోయ‌గ‌ల‌ద‌ట‌..! మ‌రి ఇంత‌కీ ఆమె ఎవ‌రో తెలుసా..?

పేరేమో ప్రియా.. క‌చ్చితంగా మ‌హిళ‌నే అయి ఉండొచ్చు. కాబ‌ట్టి ఒక మ‌హిళ 544 కేజీల బ‌రువును ఎలా మోయ‌గ‌ల‌దు..? అనే సందేహం త‌ప్ప‌కుండా వ‌స్తుంది

ప్రియా.. 544 కేజీల బ‌రువును మోయ‌గ‌ల‌ద‌ట‌..! మ‌రి ఇంత‌కీ ఆమె ఎవ‌రో తెలుసా..?

పేరేమో ప్రియా.. క‌చ్చితంగా మ‌హిళ‌నే అయి ఉండొచ్చు. కాబ‌ట్టి ఒక మ‌హిళ 544 కేజీల బ‌రువును ఎలా మోయ‌గ‌ల‌దు..? అనే సందేహం త‌ప్ప‌కుండా వ‌స్తుంది. మీకు వ‌చ్చిన సందేహంలో ఎలాంటి త‌ప్పులేదు. ఎందుకంటే ఆమె నిజ‌మైన మ‌హిళ కాదు.. ఓ కంపెనీ పేరు. అదే లిఫ్ట్‌ల‌ను బాగు చేసే కంపెనీ పేరే ప్రియా. ఇప్పుడు ఆ ప్రియ‌ గురించే నెట్టింట తెగ చ‌ర్చ జ‌రుగుతోంది.

లిఫ్ట్ లోప‌ల ప్రియా లిఫ్ట్స్ అని బోర్డు రాసి ఉంది. దాంతో పాటు 544 కేజీలు లేదా 8 మందిని మాత్ర‌మే మోయ‌గ‌ల‌దు అని రాసి ఉంచారు. ఇక నెటిజ‌న్లకు ప్రియా అని పేరు క‌నిపించ‌డంతో కోతికి కొబ్బ‌రిచిప్ప దొరికినంత ప‌నైంది. ఇక ప్రియా 8 మందిని లేదా 544 కేజీల బ‌రువును మోయ‌గ‌ల‌ద‌ట అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రియా చాలా స్ట్రాంగ్ గ‌ర్ల్ అయి ఉండొచ్చ‌ని కొంద‌రు పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన ఫొటో జూన్ 22వ తేదీన ఎక్స్‌లో పోస్టు చేయ‌గా అది విప‌రీతంగా వైర‌ల్ అయింది. 3 ల‌క్ష‌ల‌కు పైగా వీక్షించారు. వేల మంది త‌మ కామెంట్ల‌ను రాశారు. వెయిట్ లిఫ్టింగ్ చేయ‌డం అంత ఈజీ కాదు.. 544 కేజీల బ‌రువు కేవ‌లం ప్రియాకే సాధ్యం అని ఓ నెటిజ‌న్ రాసుకొచ్చారు. నేను 4 కిలోల బ‌రువు ఎత్తేస‌రికే చ‌నిపోయాను అంటూ మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నారు