Anaconda Crosses Road : అనకొండ రోడ్డెక్కింది…దెబ్బకు ట్రాఫిక్ బ్రేక్!
బ్రెజిల్ రోడ్డుపై భారీ అనకొండ పాకుతూ రావడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అమెజాన్ అడవుల్లోని ఈ అనకొండ వీడియో నెట్టింట వైరల్.
విధాత : అరణ్యాలు తరిగిపోయి..జనావాసాలు పెరిగిపోతున్న క్రమంలో వన్య ప్రాణులు..పాములు వంటి జీవరాసులు జనావాసాల్లోకి రావడం తరుచూ చూస్తుంటాం. అలాగే అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రోడ్లపై వన్యప్రాణుల సంచారం కూడా సాధారణం కొనసాగుతుంటుంది. అయితే ఓ భారీ అనకొండ అడవి మార్గం వదిలి..రోడ్డు మార్గం పట్టడంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించిన ఘటన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బ్రెజిల్‌లోని అమెజాన్ బేసిన్‌లో ఓ అనకొండ రహదారిపై ప్రత్యక్షమైంది. దాదాపు 18నుంచి 20అడుగుల పొడవు ఉన్నఆ భారీ ఆకుపచ్చ అనకొండ గ్రామీణ బ్రెజిలియన్ రోడ్డును దాటే క్రమంలో పాకుతూ వెళ్లడం కనిపించింది. రోడ్డుపై భారీ అనకొండను గమనించిన వాహనదారులు వెంటనే ఎక్కడికక్కడే వాహనాలను నిలిపివేశారు.
అనకొండ రోడ్డు దాటే వరకు వేచి చూశారు. రోడ్డుపై పాకుతూ అనకొండ ఠివీగా సమీప పొదల్లోకి వెళ్లిపోయింది. బ్రెజిల్ లో అనకొండలు వర్షకాలంలో కొత్త ఆవాసాలు..ఆహారం వెతుకుతూ ఎక్కువగా రోడ్లపైకి వస్తుంటాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
Welcome to Brazil pic.twitter.com/zFgUo7mILb
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 26, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram