VIRAL: హౌ క్యూట్.. కుక్కల ఫ్యామిలీ ఫోటోలో పిల్లి ఫోజులు!

కుక్క..పిల్లి మధ్య సహజంగానే జాతి వైరం ఉంటుంది. కుక్కకు పిల్లి కనిపిస్తే వెంటనే అది దానిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే, పిల్లి కూడా కుక్క కనిపించిందంటే చాలు భయంతో పారిపోతుంది

VIRAL: హౌ క్యూట్.. కుక్కల ఫ్యామిలీ ఫోటోలో పిల్లి ఫోజులు!

కుక్క..పిల్లి మధ్య సహజంగానే జాతి వైరం ఉంటుంది. కుక్కకు పిల్లి కనిపిస్తే వెంటనే అది దానిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే, పిల్లి కూడా కుక్క కనిపించిందంటే చాలు భయంతో పారిపోతుంది. కానీ ప్రస్తుతం సామాజిక మాధ్యమలో వైరల్ అవుతున్న వీడియో మాత్రం కుక్క..పిల్లి మధ్య అసలు జాతీ వైరం ఉంటుందా అనే సందేహాలను రేపుతోంది. తైవాన్‌లోని ఒక పెట్ షాప్ బయట చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో స్కూల్‌డ్రెస్ వేసుకున్న మూడు గోల్డెన్ రిట్రీవర్ కుక్కపిల్లలు, దగ్గరలో ఉన్న ఒక క్యాలికో పిల్లిని (Calico Cat) తమ ఫ్యామిలీ ఫోటోలోకి లాగుతూ కనిపిస్తున్నాయి. ఆ క్యూట్ సీన్‌ను చూసి నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు.

 

వీడియోలో ముూడు కుక్కలు ఫోటోకు ఫోజ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతలో పక్కనే ఉన్న పిల్లిని కూడా తమతో పాటు ఫోటో దిగడం కోసం ఆ మూడు కుక్కల్లో ఒకటి లాగుతుంది. ‘అరేయ్ ఇటు రారా అందరం కలిసి ఫోటో దిగుదాం’ అన్నట్లు ఆ కుక్క తన నోట పిల్లిని కరుచుని వచ్చి మధ్యలో నిలబెడుతుంది. ఇక మూడు కుక్కలతో కలిసి ఆ పిల్లి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో దుమ్మురేపుతోంది. ఈ క్యూట్ వీడియోను చూసిన నెటిజన్లు హార్ట్ సింబల్ పెడుతూ మురిసిపోతున్నారు. జాతి వైరం మరచి.. స్నేహం చిగురించిందని కమెంట్లు పెడుతున్నారు.