లగెత్తండ్రోయ్.. వర్షంలో చింపాంజీల పరుగు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

జంతువులు అయిన మనుషులు అయిన వర్షం పడుతుందంటే చాలు ఓ పరుగో పరుగు అంటు వెళ్లిపోతారు. వర్షంలో తడవకుండా చూసుకుంటారు. చినుకులు మీద పడకుండా గొడుగు పట్టుకుని వెళ్తారు

లగెత్తండ్రోయ్.. వర్షంలో చింపాంజీల పరుగు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

జంతువులు అయిన మనుషులు అయిన వర్షం పడుతుందంటే చాలు ఓ పరుగో పరుగు అంటు వెళ్లిపోతారు. వర్షంలో తడవకుండా చూసుకుంటారు. చినుకులు మీద పడకుండా గొడుగు పట్టుకుని వెళ్తారు. ఒకవేళ గొడుగు అందుబాటులో లేకపోతే.. తమ దగ్గర ఏదైన కవరో, వస్తువో ఉంటే అది తలపై అడ్డుగా పెట్టుకుని వర్షంలో తడవకుండా ప్రయత్నిస్తారు. అయితే, ఇది మనుషులకే కాదు, జంతువులకు కూడా వర్తిస్తుందేమో.. మరి ముఖ్యంగా చింపాజీలు.. ఈ జంతువులు ప్రవర్త, చేష్టలు చూస్తే మనుషులకు దగ్గరగా ఉంటుంది. అఫ్‌కోర్స్ కోతి జాతి నుంచే మనుషి పుట్టారు అనే సిద్ధాంత కూడా ఉన్న విషయం తెలిసిందే.

కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. జూ లో ఉండే రెండు చింపాలజీలు వర్షం పడుతున్నప్పుడు అవి ఎలా ప్రవర్తించాయో ఆ వీడియోలో చూడోచ్చు. వర్షం పడుతున్న సందర్భంలో బయట ఉన్న చింపాజీలు లగెత్తండ్రా అంటూ తమ గూడులోకి పరుగెడుతాయి. ఒకదాని వెనుక మరోటి రెండు చింపాజీలు ఇలానే పరుగెడుతాయి. ఇందులో మరోజోక్ ఏంటంటే అవి మాములుగా పరుగెత్తవు.. తమ నెత్తిపై చెతులు, సంచులు పెట్టుకుని మనలాగే పరిగెత్తుతూ కనిపిస్తాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. అవి కూడా మనలాగే ఉన్నాయి అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.