Vahan Puja for Tesla | టెస్లా ఐనా సరే – వాహన పూజ చేయకపోతే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ రాదు: హైదరాబాద్ వ్యక్తి వైరల్ పోస్ట్!
హైదరాబాద్ వ్యక్తి తన టెస్లా Model Yకి వాహన పూజ చేసి “ఇది ఇండియన్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్” అని సరదాగా కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
No Car Gets 5-Star Safety Without Vahan Puja’: Hyderabad Man’s Tesla Blessing Goes Viral
హైదరాబాద్, అక్టోబర్ 3, 2025:
భారతీయ సంస్కృతిలో ఏ వాహనం అయినా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాలంటే వాహన పూజ తప్పక చేయాల్సిందేనంటూ, హైదరాబాద్‌కు చెందిన ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ కోడురు తన కొత్త టెస్లా మోడల్ Yకు సాంప్రదాయక ‘వాహన పూజ’ నిర్వహించారు. ఆక్టోబర్ 1న X (ట్విటర్)లో పోస్ట్ చేసిన ఫోటోల్లో, అల్ట్రా రెడ్ కలర్‌లో ఉన్న కొత్త టెస్లా పూల మాలలతో అలంకరించబడి, చక్రాలపై పసుపుకుంకుమలతో ఆలయం ముందు నిలబడగా, కుటుంబ సభ్యులు సంప్రదాయ వస్త్రాల్లో కనిపించారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో ఈ పూజ జరిగింది.
టెస్లా సహా ఏ వాహనమైనా భారతీయ సంస్కృతిలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాలంటే వాహన పూజ చేయాలని డాక్టర్ ప్రవీణ్ కోడురు Xలో పోస్ట్ చేసారు. దానికి ఇంకా ఎలాన్ మస్క్, టెస్లా ఇండియా, టెస్లా క్లబ్ ఇండియాలను కూడా ట్యాగ్ చేశారు. భారతదేశంలో కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు ఆలయానికి తీసుకెళ్లి పూజ చేయడం సంప్రదాయం. ఇందులో నిమ్మకాయలు తొక్కించడం, పూలదండలు వేసి, పసుపుకుంకుమలు పూసి, ఆలయ పూజారి మంత్రాలు చదువుతూ పూజలు చేస్తారు. ఇది భారత్‌లో తరతరాలుగా వస్తున్న ఆచారం.

పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆనందంగా స్పందించారు. ఒకరు “ఇది ఓవర్‌షీల్డ్ ఈక్వివలెంట్” అన్నారు. మరొకరు “భారతదేశంలో వాహన పూజే అల్టిమేట్ క్రాష్ టెస్ట్ సర్టిఫికేషన్” అని కామెంట్ చేశారు. “నిమ్మకాయ, మిరపకాయలు లేకుండా టెస్లా సేఫ్ కాదు” అని జోక్ చేసారు. డాక్టర్ కోడురు తన టెస్లా మోడల్ Yను హైదరాబాద్‌లో మొట్టమొదటిదిగా సెప్టెంబర్ 27న పోస్ట్ చేశారు.
టెస్లా ఇండియాలో: జూలైలో ధరలు ప్రకటన
టెస్లా జూలై 2025లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. మోడల్ Y ధరలు: రియర్-వీల్-డ్రైవ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ రూ.59.89 లక్షలు, లాంగ్-రేంజ్ రియర్-వీల్-డ్రైవ్ రూ.67.89 లక్షలు. ఆన్-రోడ్ ధర రూ.61 లక్షల నుంచి మొదలవుతుంది. డెలివరీలు ఆక్టోబర్‌లో మొదలయ్యాయి. ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ (FSD) ఆప్షన్‌కు రూ.6 లక్షలు అదనం.
ఈ ఘటన ఆధునిక సాంకేతిక, పురాతన సంప్రదాయాల మిశ్రమాన్ని చూపిస్తూ, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సాధారణ పూజను సరదాగా “ఇండియన్ క్రాష్ టెస్ట్” అని చెప్పడంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram