Viral News | చీర నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. షాక్‌లో వరుడు!

ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వరుడి కుటుంబం తీసుకొచ్చిన చీర నచ్చలేదని ఓ వధువు ఏకంగా పెళ్లినే ఆపేసింది. నాకు నచ్చని చీర కట్టుకుని పెళ్లి చేసుకునేదే లేదు అని మొండిపట్టు పట్టింది.

Reported by: Chandram | వైరల్ న్యూస్ | May 14, 2026, 7:26 am IST
Read Time: 4 mins
Viral News | చీర నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. షాక్‌లో వరుడు!

Viral News | వరుడి కుటుంబం తీసుకొచ్చిన చీర నచ్చలేదని ఓ వధువు ఏకంగా పెళ్లినే ఆపేసింది. నాకు నచ్చని చీర కట్టుకుని పెళ్లి చేసుకునేదే లేదు అని మొండిపట్టు పట్టింది. పెళ్లికూతురికి నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె ససేమిరా అనేసింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరిగి తన్నుకునే స్థాయికి వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా దలన్ చప్రా గ్రామానికి చెందిన అజయ్ గోండ్ కుమార్తె నిక్కీకి, మహదాన్‌పూర్ గ్రామానికి చెందిన పవన్ గోండ్ కుమారుడు విశాల్ గోండ్‌తో వివాహం నిశ్చయమైంది. మే 11వ తేదీన గాయ్‌ఘాట్ గ్రామంలోని ఉన్న పంచ్‌రుకి అమ్మవారి ఆలయంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. వరుడు మేళతాళాలతో ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయల్దేరాడు. పెళ్లి క్రతువు మొదలయ్యే సమయంలో ఆచారం ప్రకారం.. పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు పెళ్లి కూతురికి ఒక చీరను బహూకరించారు. ఆ చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చోవాలని చెప్పారు.

అయితే వరుడి కుటుంబం ఇచ్చిన చీరను చూసి వధువు కాస్త అసహనానికి గురైంది. ఆ చీర తనకు ఏ మాత్రం సెట్ కాదని.. అది అన్‌సూటబుల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నచ్చని చీర కట్టుకుని పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. వధువు అలా చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. పెద్దలు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ తను మాత్రం ససేమిరా అంటూ మొండిపట్టు పట్టింది. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చెలరేగింది. కాసేపటికే అది కాస్త ఘర్షణకు దారితీసింది.

ఇరు వర్గాల వాళ్లు పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. ఈ ఘటనలో వధువు సోదరుడు, తల్లి, మరో మహిళ గాయపడ్డారు. పెళ్లిలో మొదలైన ఈ గొడవ చివరకు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. వధువు తండ్రి అజయ్ గోండ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరుడు, అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read More:

Milk Price Hike | అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు.. నేటి నుంచే అమలు!

Viral Video | పెళ్లి మండపంలో స్విగ్గీ డెలివరీ బాయ్.. వీడియో వైరల్