Yezdi Roadster 2025 | యెజ్డీ రోడ్‌స్టర్‌ 2025 కొత్త మోడల్‌ భారత్‌లో విడుదల – ధరలు, ప్రత్యేకతల వివరాలు ఇవిగో

యెజ్డీ రోడ్‌స్టర్‌ 2025 కొత్త మోడల్‌ భారత్‌లో విడుదలైంది. 350cc ఆల్ఫా2 ఇంజిన్‌, టూరింగ్‌ సౌకర్యాలు, ఐదు కలర్‌ ఆప్షన్లు, కస్టమైజేషన్‌ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.

  • By: TAAZ |    trending |    Published on : Aug 16, 2025 10:17 PM IST
Yezdi Roadster 2025 | యెజ్డీ రోడ్‌స్టర్‌ 2025 కొత్త మోడల్‌ భారత్‌లో విడుదల – ధరలు, ప్రత్యేకతల వివరాలు ఇవిగో

Vidhatha Tech Desk / Auto News / August 16, 2025

Yezdi Roadster 2025 | భారతీయ మోటార్‌సైకిల్‌ ప్రియులకు యెజ్డీ మరోసారి కొత్త బహుమతిని అందించింది. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్‌ సంస్థ తాజాగా యెజ్డీ రోడ్‌స్టర్‌ 2025 మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. నూతన శైలీకరణ, విభిన్న కస్టమైజేషన్‌ ఆప్షన్లు, దీర్ఘకాలిక టూరింగ్‌ సామర్థ్యాలు ఈ బైక్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ధరలు మరియు కలర్‌ ఆప్షన్లు

ఈ మోడల్‌ ధర ₹2.09 లక్షల (ఎక్స్‌–షోరూమ్‌) నుండి ప్రారంభమవుతుంది. ఐదు ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి:

  • షార్క్‌స్కిన్‌ బ్లూ – ₹2,09,969
  • స్మోక్‌ గ్రే – ₹2,12,969
  • బ్లడ్‌రష్‌ మారూన్‌ – ₹2,16,969
  • సావేజ్‌ గ్రీన్‌ – ₹2,21,969
  • షాడో బ్లాక్‌ (ప్రత్యేక ఎడిషన్‌) – ₹2,25,969

షాడో బ్లాక్‌ వేరియంట్‌ ప్రీమియం టచ్‌లతో రావడం విశేషం. మ్యాట్‌ బ్లాక్‌ ఫినిషింగ్‌, బ్లాక్డ్‌–అవుట్‌ ట్రిమ్స్‌, డ్యూయల్‌ ఫంక్షన్‌ బ్లింకర్స్‌ ఈ వేరియంట్‌ను ప్రత్యేకంగా చూపిస్తున్నాయి.

ఇంజిన్‌ స్పెసిఫికేషన్లు

యెజ్డీ రోడ్‌స్టర్‌ 2025లో 350cc ఆల్ఫా2 లిక్విడ్‌–కూల్డ్‌ సింగిల్‌–సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చబడింది. ఇది 29 bhp పవర్‌, 30 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్‌ గేర్‌బాక్స్‌ (Slipper & Assist Clutch‌తో) దూర ప్రయాణాల్లో సులభమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని ఇస్తుంది.

డిజైన్‌,  ఫీచర్లు

బైక్‌ డిజైన్‌లో క్లాసిక్‌ లుక్‌ను కొనసాగిస్తూనే ఆధునిక సౌలభ్యాలు జోడించారు.

  • రౌండ్‌ LED హెడ్‌లైట్‌
  • హైడ్రోఫార్మ్డ్‌ హ్యాండిల్‌ బార్లు
  • టియర్‌డ్రాప్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌
  • రిమూవబుల్‌ రియర్‌ సీటు
  • టూరింగ్‌ వైజర్స్‌, ట్విన్‌–రాడ్‌ క్రాష్‌ గార్డ్స్‌

12.5 లీటర్ల ఇంధన ట్యాంక్‌ ఉన్న ఈ బైక్‌ ఒక్కసారి ఫుల్‌ట్యాంక్‌తో 350 కిమీ మైలేజ్ అందిస్తుంది.

సేఫ్టీ, హార్డ్‌వేర్‌

  • డ్యూయల్‌–చానెల్‌ ABS (Continental నుండి)
  • 320 mm ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌, 240 mm రియర్‌ డిస్క్‌ బ్రేక్‌
  • టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌, డ్యూయల్‌ రియర్‌ షాక్‌ అబ్జార్బర్స్‌

795 mm సీటు ఎత్తు, 1440 mm వీల్‌బేస్‌తో సౌకర్యవంతమైన రైడింగ్‌ అనుభవాన్ని ఇస్తుంది.

కస్టమైజేషన్‌ ఆప్షన్లు

యెజ్డీ రోడ్‌స్టర్‌ 2025లో అనేక ఫ్యాక్టరీ–బ్యాక్డ్‌ కస్టమైజేషన్‌ ఆప్షన్లు ఉన్నాయి. 50కి పైగా యాక్సెసరీస్‌ లభ్యమవుతాయి.

  • హ్యాండిల్‌బార్‌: స్టాండర్డ్‌ లేదా వైడ్‌ స్ట్రైట్‌ టైప్‌
  • వైజర్స్‌ & కౌల్స్‌: షార్ట్‌ లేదా టాల్‌ టూరింగ్‌ వైజర్స్‌
  • క్రాష్‌ గార్డ్స్‌: ట్విన్‌–రాడ్‌ ఫ్రేమ్డ్‌ స్లైడర్స్‌తో
  • టూరింగ్‌ కోసం: బ్యాక్‌ రెస్ట్‌లు, రియర్‌ రాక్స్‌, మల్టీ ఫంక్షనల్‌ బ్లింకర్స్‌

వారంటీ మరియు సర్వీస్‌

ఈ మోడల్‌కి 4 సంవత్సరాలు/50,000 కిమీ స్టాండర్డ్‌ వారంటీ ఇస్తున్నారు. అదనంగా 6 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 450 సర్వీస్‌ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి.  సంస్థ సహవ్యవస్థాపకుడు అనుపమ్‌ తరేజా మాట్లాడుతూ – “యెజ్డీ రోడ్‌స్టర్‌ లేడిలా కనిపించే  పులి. పాత తరం రైడర్స్‌కి ఉన్న జ్ఞాపకాలు మళ్లీ నేటి తరానికి అందించడమే మా లక్ష్యం. ఈ కొత్త రోడ్‌స్టర్‌ ఒక చాలెంజర్​. కొత్త తరం రైడర్స్‌ స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, సాహసాలకు చిహ్నంగా నిలుస్తుంది” అన్నారు.