Tirupati Laddu | తిరుపతి లడ్డూ నాణ్యత పెంచాం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
గత ప్రభుత్వ పాలనలో లోపించిన లడ్డూ నాణ్యతను తాము తిరిగి పునరుద్ధరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

TTD – Tirupati: తిరుమల విచ్చేస్తున్న భక్తులు(Devotees) ఇప్పుడు లడ్డూ నాణ్యత(Laddu prasadam Quality)పై ప్రశంసలు కురిపిస్తున్నారని, దీన్ని ఇలాగే కొనసాగించాలి కోరుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(AP CM Chandrababu Naidu) సంతోషం వ్యక్తం చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి, అత్యంత నాణ్యత కలిగిన పదార్థాల(Best quality ingredients)నే ప్రసాదాల తయారీకి వినియోగించాలని ఆదేశించనట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ(YSRCP Govt) హయాంలో కల్తీ నెయ్యి లడ్డూ తయారీలో వినియోగించారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ సమీక్ష జరిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan Reddy) ఈ ఆరోపణలను కొట్టిపారేసారు.
కాగా, శ్రీవారి దర్శనాలలో విఐపీ సంస్కృతి(VIP Culture)ని తగ్గించాలని, ప్రముఖులు దర్శానికి వచ్చినప్పుడు ఎటువంటి హడావుడి చేయొద్దని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాలయ అలంకరణ సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని, అనవసరపు ఆడంబరాలకు పోయి వృథా ఖర్చులు చేయవద్దని సూచించారు. గోవింద నామాలు తప్ప అన్య పదాలు కొండపై వినిపించకూడదని, 72 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 80 శాతానికి పెంచేలా కృషి చేయాలని కోరారు. ఆ తరువాత టిటిడి క్యాలెండర్ Calendar-2025, డైరీ(Dairy-2025)లను ఆవిష్కరించారు.
శుక్రవారం తిరుమలలోనే బస చేసిన ముఖ్యమంత్రి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల(Annual Brahmotsavam) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సతీమణి భువనేశ్వరితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తిరుమలలో వకుళమాత కేంద్రీకృత వంటశాల(Vakulamatha Centralised Kitchen)ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమల దేవస్థానం పవిత్రతను అందరూ కాపాడటానికి కృషి చేయాలని, శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు కూడా ఈ విషయంలో టిటిడికి సహకరించాలని కోరారు.
Tags: