ఎవరూ క్లెయిమ్‌‌‌‌ చేయని డబ్బు 82 వేల కోట్లు! 

విధాత :బ్యాంక్ అకౌంట్లు,పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,మ్యూచువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మూలుగు తున్నయ్​ నామినీ లేక పోవడం,ఫ్యామిలీకి తెలియకపోవడమే కారణం.ఓ మ్యూచువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫ్లాగ్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈక్విటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకటి మెచ్యూరిటీ అయ్యి 10 ఏళ్లు దాటింది.కానీ, ఎవరూ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఆ ఫండ్ హౌసే ఆ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కంగ్రాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెబుతూ ఓ లెటర్ పంపించింది.దీంతో ఆ ఇన్వెస్టర్ 10 ఏళ్ల కిందటే చనిపోయాడని, ఇలాంటి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకటి చేశాడనే విషయం కూడా అతని ఫ్యామిలీకి తెలియదనే విషయం […]

ఎవరూ క్లెయిమ్‌‌‌‌ చేయని డబ్బు 82 వేల కోట్లు! 

విధాత :బ్యాంక్ అకౌంట్లు,పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,మ్యూచువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మూలుగు తున్నయ్​ నామినీ లేక పోవడం,ఫ్యామిలీకి తెలియకపోవడమే కారణం.ఓ మ్యూచువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫ్లాగ్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈక్విటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకటి మెచ్యూరిటీ అయ్యి 10 ఏళ్లు దాటింది.కానీ, ఎవరూ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఆ ఫండ్ హౌసే ఆ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కంగ్రాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెబుతూ ఓ లెటర్ పంపించింది.దీంతో ఆ ఇన్వెస్టర్ 10 ఏళ్ల కిందటే చనిపోయాడని, ఇలాంటి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకటి చేశాడనే విషయం కూడా అతని ఫ్యామిలీకి తెలియదనే విషయం ఆ మ్యూచువల్​ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్థమయ్యింది.ఇలా క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకో కుండా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లలో, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీలలో, పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లలో, మ్యూచువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్ పోర్టుఫోలియోలలో సుమారు రూ. 82 వేల కోట్లు పడి ఉన్నాయి.

మరికొన్ని సందర్భాలలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాక,ఆ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చనిపోవడం లేక మరిచిపోవడమో జరుగుతోంది.దీంతో ఆ డబ్బులు మెచ్యూరిటీ కావడం లేదు.అప్పటి వరకు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన డబ్బులను కూడా ఎవరూ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోక పోవడంతో ఈ అమౌంట్ ప్రభుత్వానికి వెళ్లిపోతోంది.రూ. 82 వేల కోట్లపై ఏడాదికి 6 శాతం వడ్డీ వేసుకున్నా,సంవత్సరానికి రూ. 4,900 కోట్ల వడ్డీని ఈ ఇన్వెస్టర్లు నష్ట పోతున్నారు. అంటే రోజుకి రూ.14 కోట్లను కోల్పోతున్నారు.అకౌంట్లు ఇనాక్టివ్‌‌‌‌ అయిన 25 ఏళ్లలోపు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోకపోతే ఆ డబ్బులు ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,సీనియర్ సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి వాటికి వెళ్లిపోతున్నాయి.

బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లలో రూ. 18,381 కోట్లు..
ఇప్పటి వరకు బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లలో రూ.18,381 కోట్లు క్లెయిమ్ కాకుండా ఉండిపోయాయి.ఇందులో కూడా అకౌంట్లు తాత్కాలికంగా నిలిచిపోవడంతో రూ. 12 వేల కోట్లు క్లెయిమ్ కాకుండా ఉండిపోయాయి.రెండేళ్లలో ఎటువంటి ట్రాన్సాక్షన్లు జరగకపోతే, ఆ అకౌంట్లను బ్యాంకులు నిలిపేస్తాయి.ఇటువంటి అకౌంట్లను తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడం ఈజీ అని ఎనలిస్టులు చెబుతున్నారు.

రూ.25 వేల కంటే తక్కువ సేవింగ్స్ ఉన్న అకౌంట్లను బ్యాంక్ బ్రాంచులకు వెళ్లి లీగల్ వారసులు లేదా అకౌంట్ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడిపించుకోవచ్చు.అకౌంట్ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చనిపోతే అతని డెత్ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సబ్మిట్ చేసి,లీగల్ వారసుడు తన ఐడెంటీని నిరూపించుకుంటే ఆ సేవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్బులను ఇచ్చేస్తారు.అదే రూ. 25 వేల కంటే ఎక్కువ అమౌంట్ నిలిచిపోయిన అకౌంట్లలో ఉంటే మాత్రం కోర్టుకి వెళ్లి సక్సెసన్ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వారసుడు) ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు బ్యాంకుల్లో రూ.4,820 కోట్ల విలువైన ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ) మెచ్యూరిటీ అయినా ఎవరూ క్లెయిమ్ చేసుకోవడం లేదు.
ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలు మెచ్యూరిటీ అయ్యి 10 ఏళ్లు దాటినా కూడా ఎవరూ క్లెయిమ్ చేసుకోకపోతే ఆ డబ్బులు డిపాజిటరీ ఎడ్యూకేషన్ అండ్ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డీఈఏఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కు షిఫ్ట్ అయిపోతాయి.కిందటేడాది మార్చి నాటికి డీఈఏఎఫ్ వద్ద ఇలాంటి ఫండ్స్ రూ. 33,114 కోట్లుగా ఉన్నాయి.
డిజిటల్ టెక్నాలజీ విస్తరించక ముందు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి.ప్రస్తుతం అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా నామినీని పెట్టాలని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి.

పాలసీలు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవట్లే!

లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద కూడా పెద్ద మొత్తంలో డబ్బులు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా ఉండి పోతున్నాయి.సాధారణంగా పాలసీలను తీసుకునేటప్పుడు పాలసీహోల్డర్ కుటుంబాలకు తెలుస్తుంటుంది.కానీ, కంపెనీల దగ్గర రూ. 15,167 కోట్ల విలువైన పాలసీలు ఇంకా క్లెయిమ్ కాలేదంటేనే చాలా మంది పాలసీ హోల్డర్లు ఇన్సూరెన్స్ తీసుకు న్నారనే విషయం ఎవరికీ తెలియలేదని అర్థమవుతోంది.ఒక్క ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ దగ్గరనే రూ. 7 వేల కోట్ల విలువైన లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ పాలసీలు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా పడి ఉన్నాయి.

డివిడెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవట్లేదు.

సుమారు రూ. 1,100 కోట్ల విలువైన డివిడెండ్లను ఇన్వెస్టర్లు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోలేదని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లేని పోర్టు ఫోలియోలలో అన్​క్లెయిమ్డ్​ ఇన్వెస్ట్​మెంట్ల విలువ రూ.17,880 కోట్లుగా ఉన్నాయి.కాగా, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలు, ఇన్సూరెన్స్ పాలసీలలా కాకుండా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యూచువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మెచ్యూరిటీ డేట్ అంటూ ఏమీ ఉండదు.ఏడేళ్ల వరకు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోని డివిడెండ్లను ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్ అథారిటీకి పంపుతారు.ప్రస్తుతం ఈ సంస్థ వద్ద రూ.4,100 కోట్ల డివిడెండ్లు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా ఉన్నాయని అంచనా.

రెగ్యులేటరీలు పని చేస్తున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఇలా క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా ఉండిపోయే అకౌంట్లను తగ్గించేందుకు రెగ్యులేటరీ సంస్థలు పనిచేస్తున్నాయి.అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లెయిమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లను బ్యాంకులు తమ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో ఉంచాలని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఆదేశించింది.ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు కూడా ఇలా క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాని అకౌంట్ల డిటైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ ఆదేశాలిచ్చింది.సెబీ అయితే ఏదైనా పోర్టుఫోలియో ఇనాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటే ఆ డబ్బులను తీసుకొచ్చే అదే ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిరిగి పెట్టాలని గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ విడుదల చేసింది.ఇనాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లకు సాయం చేసేందుకు ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలో ఒక హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్ పనిచేస్తోంది.ఇన్వెస్టర్లు లేదా వారసులు ఆయా సంస్థల వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ల లోకి వెళ్లి క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాని ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ల గురించి తెలుసుకోవచ్చు.

ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ దగ్గరే ఎక్కువ..

ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ అకౌంట్లలో రూ. 26,497 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు క్లెయిమ్‌‌‌‌‌‌‌‌ కాకుండా పడి ఉన్నాయి.ఒక పీఎఫ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌లోని అమౌం ట్‌‌‌‌‌‌‌‌ను వేరే పీఎఫ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసుకునే అవకాశం ఇంతకుముందు ఉండేది కాదు.దీంతో ఒక్కొక జాబ్‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సగటున ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్లు ఉండేవి.కొన్ని అకౌంట్లలో డబ్బులున్నాయనే విషయం కూడా వీరు మరిచిపోయేవారు.దీంతో పీఎఫ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లలో క్లెయిమ్‌‌‌‌‌‌‌‌ కాకుండా పెద్ద మొత్తంలో అమౌంట్ పడి ఉంది.పీఎఫ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో జరిగే చివరి కంట్రిబ్యూషన్ నుంచి మూడేళ్ల వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌ జరగకపోతే ఆ అకౌంట్లు ఇనాక్టివ్‌‌‌‌‌‌‌‌గా మారి పోతాయి.ఏడేళ్ల వరకు ఇదే పొజిషన్‌‌‌‌‌‌‌‌లో ఉంటే ఆ అమౌంట్‌‌‌‌‌‌‌‌ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌‌‌‌‌‌‌‌ కు వెళ్లిపోతుంది.ఈ డబ్బులను తిరిగి పొందాలంటే సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్ లేదా అతని లీగల్‌‌‌‌‌‌‌‌ వారసుడు ఇనాక్టివ్ అయిన 25 ఏళ్లలోపు సరియైన ప్రూఫ్స్‌‌‌‌‌‌‌‌తో వచ్చి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.