మోదీ ప్రభుత్వాన్నివిమర్శిస్తే ఖ‌బ‌డ్దార్‌ హీరో సూర్యకు బిజేపీ వార్నింగ్

విధాత:కేంద్రం నీట్ సెలక్షన్ విధానం వల్ల తమిళనాడు పేద విద్యార్థులు నష్టపోతారని హీరో సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సినిమాటోగ్రఫీ బిల్లుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సూర్యపై తమిళనాడు బీజేపీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం అధ్యక్షతన సమావేశమైన కార్యవర్గం సూర్య వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశం అనంతరం తమిళ బీజేపీ నేతలు సూర్యకు వార్నింగ్ ఇచ్చారు. సూర్య […]

మోదీ ప్రభుత్వాన్నివిమర్శిస్తే ఖ‌బ‌డ్దార్‌ హీరో సూర్యకు బిజేపీ వార్నింగ్

విధాత:కేంద్రం నీట్ సెలక్షన్ విధానం వల్ల తమిళనాడు పేద విద్యార్థులు నష్టపోతారని హీరో సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సినిమాటోగ్రఫీ బిల్లుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సూర్యపై తమిళనాడు బీజేపీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం అధ్యక్షతన సమావేశమైన కార్యవర్గం సూర్య వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశం అనంతరం తమిళ బీజేపీ నేతలు సూర్యకు వార్నింగ్ ఇచ్చారు. సూర్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకోవాలని, ఇతర విషయాలపై అనవసర జోక్యం, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. సూర్య ఇదే రీతీలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి పాల్పడితే కోర్టుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తుంద‌ని హెచ్చరించారు.