నెలాఖరుకు క‌రోనా తగ్గుముఖం.. వ్యాక్సినాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్‌

విధాత‌(న్యూఢిల్లీ): దేశంలో కరోనా ఉద్ధృతి ఈ నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టొచ్చని ప్రముఖ వ్యాక్సినాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్‌ అన్నారు. తర్వాత మరో ఒకటి లేదా రెండు సార్లు కరోనా వేవ్‌ రావొచ్చని అయితే అవి ఇప్పుడున్నంత ప్రమాదకరంగా ఉండవవని ఆమె పేర్కొన్నారు. ఇండియన్‌ వుమెన్‌ ప్రెస్‌ కార్ప్స్‌ నిర్వహించిన వెబినార్‌లో ఆమె మాట్లాడారు. మొదటి వేవ్‌లో వైరస్‌ వ్యాపించని గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఇప్పుడు వైరస్‌ విస్తరించిందని అందుకే కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం వైరస్‌ […]

నెలాఖరుకు క‌రోనా తగ్గుముఖం.. వ్యాక్సినాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్‌

విధాత‌(న్యూఢిల్లీ): దేశంలో కరోనా ఉద్ధృతి ఈ నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టొచ్చని ప్రముఖ వ్యాక్సినాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్‌ అన్నారు. తర్వాత మరో ఒకటి లేదా రెండు సార్లు కరోనా వేవ్‌ రావొచ్చని అయితే అవి ఇప్పుడున్నంత ప్రమాదకరంగా ఉండవవని ఆమె పేర్కొన్నారు.

ఇండియన్‌ వుమెన్‌ ప్రెస్‌ కార్ప్స్‌ నిర్వహించిన వెబినార్‌లో ఆమె మాట్లాడారు. మొదటి వేవ్‌లో వైరస్‌ వ్యాపించని గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఇప్పుడు వైరస్‌ విస్తరించిందని అందుకే కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం వైరస్‌ గురించి ఉన్న సమాచారాన్ని బట్టి దాని వ్యాప్తిని 14 రోజుల వరకు మాత్రమే అంచనా వేయగలం. రాబోయే 3 నెలల్లో ఎలా ఉంటుంది, 6 నెలల్లో ఎలా ఉంటుంది అన్న విషయాలు చెప్పలేం’ అని ఆమె వ్యాఖ్యానించారు. కొవిడ్‌ నుంచి కోలుకొంటున్నవారిలో ఇమ్యూనిటీ పెరుగుతున్నదని, అయితే వైరస్‌ జన్యుక్రమం మార్చుకొంటున్న కారణంగా అది సరిపోదని చెప్పారు.

ఇమ్యూనిటీ మరింత బలపడటానికి టీకా వేసుకోవాలని సూచించారు. టీకాలపై భయం అక్కర్లేదని, సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పారు.