ఫ్రీగా కోటి గ్యాస్ కనెక్షన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

విధాత:ఉజ్వల 2.0 స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా పేద మహిళలకు ఉచితంగా కోటికి పైగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2016లో ప్రారంభమైన ఉజ్వల స్కీమ్‌ తొలి దశలో అర్హులైనప్పటికీ గ్యాస్ కనెక్షన్లను పొందలేకపోయిన వారికి ఉజ్వల 2.0 ద్వారా అందజేయాలని నిర్ణయించింది. ఈ స్కీమ్‌ కింద లబ్ధిదారులకు ఫ్రీ సిలిండర్‌‌తో పాటు స్టౌవ్‌ కూడా అందజేస్తారు. […]

ఫ్రీగా కోటి గ్యాస్ కనెక్షన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

విధాత:ఉజ్వల 2.0 స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా పేద మహిళలకు ఉచితంగా కోటికి పైగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2016లో ప్రారంభమైన ఉజ్వల స్కీమ్‌ తొలి దశలో అర్హులైనప్పటికీ గ్యాస్ కనెక్షన్లను పొందలేకపోయిన వారికి ఉజ్వల 2.0 ద్వారా అందజేయాలని నిర్ణయించింది. ఈ స్కీమ్‌ కింద లబ్ధిదారులకు ఫ్రీ సిలిండర్‌‌తో పాటు స్టౌవ్‌ కూడా అందజేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?
ఉజ్వల స్కీమ్‌కు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే ఆప్లై చేసుకోవాల్సి ఉంటుంది.pmujjwalayojana.com వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు form డౌన్‌లోడ్ చేసుకుని, దానిని ఫిల్ చేసి దగ్గరలోని ఎల్పీజీ సెంటర్‌‌లో సబ్మిట్‌ చేయాలి. లేదంటే సమీపంలో ఉన్న ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి అప్లికేషన్ తీసుకుని దానిని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఫొటో, రేషన్ కార్డు, ఆధార్ జెరాక్సులు ఇవ్వాల్సి ఉంటుంది.

అప్లై చేసుకోవడానికి అర్హులెవరు?

ఉజ్వల్ 2.0 స్కీమ్‌కు అప్లై చేసుకోవడానికి మహిళలు మాత్రమే అర్హులు.దరఖాస్తు చేసుకునే మహిళకు 18 ఏండ్ల వయసు పూర్తయి ఉండాలి.దరఖాస్తుదారు ఇంట్లో ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉండాలి.వలస కార్మికులు కూడా ఉజ్వల్ 2.0 కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్‌కు అప్లై చేసుకోవచ్చు.వలస కార్మికులు రేషన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన పని లేదు. కేవలం సెల్ఫ్‌ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది.