‘దిశ’ హత్యాచారం కేసు లో సెలబ్రిటీలపై కేసు

విధాత:శంషాబాద్‌లో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసుకు సంబంధించి.. బాధితురాలి పేరును వెల్లడించారంటూ 40 మంది సెలబ్రిటీలపై ఢిల్లీలోని సబ్జిమండి పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది. గౌరవ్‌ గులాటీ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని సెక్షన్‌ 228ఏ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి,వారెంట్‌ జారీ చేశారు.దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో.. గౌరవ్‌ గులాటీ తాజాగా శనివారం తీస్‌హజారీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ […]

‘దిశ’ హత్యాచారం కేసు లో సెలబ్రిటీలపై కేసు

విధాత:శంషాబాద్‌లో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసుకు సంబంధించి.. బాధితురాలి పేరును వెల్లడించారంటూ 40 మంది సెలబ్రిటీలపై ఢిల్లీలోని సబ్జిమండి పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది. గౌరవ్‌ గులాటీ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని సెక్షన్‌ 228ఏ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి,వారెంట్‌ జారీ చేశారు.దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో.. గౌరవ్‌ గులాటీ తాజాగా శనివారం తీస్‌హజారీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ కేసులో నిందితుల జాబితాలో బాలీవుడ్‌/టాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవ్‌గన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఫర్హాన్‌ అక్తర్‌, అనుపమ్‌ఖేర్‌, అర్మాన్‌ మాలిక్‌, కరీంవీర్‌ వోహ్రా, రవితేజ, అల్లు శిరీష్‌, సాయి ధరమ్‌తేజ్‌, పరిణీత చోప్రా, దియా మిర్జా, స్వర భాస్కర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జరీన్‌ ఖాన్‌, యామి గౌతమ్‌, రిచా చద్దా, కాజల్‌ అగర్వాల్‌, షబానా అజ్మీ, హన్సిక మోత్వాని, ప్రియా మాలిక్‌, మెహ్రీన్‌ పిర్జాదా, నిధి అగర్వాల్‌, ఛార్మీ కౌర్‌, అశిక రంగనాథ్‌, కీర్తి సురేష్‌, దివ్యాంశ్‌ కౌశిక్‌, మోడల్‌ లావణ్య, ఫిల్మ్‌ మేకర్‌ అలంకిత శ్రీవాస్తవ, బాలివుడ్‌ దర్శకుడు మధుర్‌ భండార్కర్‌, గాయని సోనా మహాపాత్ర, టాలివుడ్‌ దర్శకుడు సందీ్‌పరెడ్డి, క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, స్టార్‌ షెట్లర్‌ సైనా నెహ్వాల్‌ తదితరుల పేర్లు ఉన్నాయి. వీరంతా ట్విటర్‌లో బాధితురాలి పేరును, ఫొటోను పోస్టు చేశారని గౌరవ్‌ గులాటీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.